Thursday, November 21, 2024

Nizamabad – వరద నీటిలో ఆర్టీసీ బస్సు..

ఇందూరులో భారీ వర్షం
స్థానికుల సహాయంతో ప్రయాణికులు క్షేమం..
కార్పొరేషన్ ప్రత్యేక ఏర్పాట్లు
సంఘటన స్థలాన్ని పరిశీలించిన కార్పొరేషన్ కమిషనర్

నిజామాబాద్ ప్రతినిధి ఆగస్టు ( ప్రభ న్యూస్)19: నిజామాబాద్ నగరంలో భారీ వర్షం కురిసింది. కొన్ని గంటల పాటు ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షానికి కంటేశ్వర్ కమాన్ లో గల ఆర్ యు బి వద్ద చేరిన వరద నీటిలో ఆర్టీసీ బస్సు చిక్కు కు పోయింది. కొంతసేపు వర్షపు నీటిలో చిక్కు కుపోవడంతో ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు. స్థానికుల సహాయంతో ప్రయాణికులను క్షేమంగా బయటపడ్డారు. అగ్నిమాపక శాఖ,కార్పొరేషన్ శాఖ సంయుక్తంగా జెసిబి సహాయంతో ఆర్టీసీ బస్సును వర్షపు నీటి నుంచి బయటకు తీశారు.

- Advertisement -

సంఘటన స్థలాన్ని పరిశీలించిన కార్పొరేషన్ కమిషనర్ మంద మకరంద్

వర్షపు నీటిలో ఆర్టీసీ బస్సు చిక్కుకున్న విషయం తెలిసిన వెంటనే కార్పోరేషన్ కమిషనర్ ఆదేశాల మేరకు ప్రత్యేక చర్యలు చేపట్టారు. నిల్వ ఉన్న వర్షపు నీరు బయటకు వెళ్లేలా కార్పొరేషన్ సిబ్బంది పనులు చేపట్టారు.స్పెషల్ మాన్సూన్ టీమ్ తో వరద నీరు తొలగిం చడానికి సత్వర చర్యలు చేపట్టారు సంఘ టన స్థలాన్ని కార్పొరేషన్ కమిషనర్ మకరంద్ పరిశీలించారు. అధికారులకు పలు సూచనలు చేశారు. రైల్వే కమాన్ వద్ద భారీగా నిలిచిన నీరు, వాహనాల రాకపోకలకు ఇబ్బంది ఏర్పడింది.ఈ కార్యక్రమంలో నాలుగో టౌన్ సీఐ నరహరి, ఎస్సై, కార్పొరేషన్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

జేబీఎస్ నుంచి 90 మంది ప్రయాణికులతో బయలుదేరిన బస్సు

నిజామాబాద్ డిపో వన్ కు చెందిన ఆర్టీసీ బస్సు సుమారు 90 మంది ప్రయా ణికులతో జేబీఎస్ నుంచి నిజామాబాద్ కు బయలుదేరింది. కంటేశ్వర్ కమాన్ ఆర్ యూ బి వద్ద చేరిన వరద నీటిలో ఆర్టీసీ బస్సు చిక్కుకుంది. ఇందులో సుమారు 50 నుండి 60 మంది ప్రయాణికులు ఉన్నారు. ప్రయాణికులు క్షేమంగా బయటపడడంతో ఊపిరి పీల్చుకున్నారు. వరద నీటిలో చిక్కుకున్న ఆర్టీసీ బస్సుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement