అభివృద్ధి ,సంక్షేమమే మా ధ్యేయం..బీఆర్ఎస్ అర్బన్ ఎమ్మెల్యే అభ్యర్థి గా గణేష్ బిగాల నామినేషన్ దాఖలు..నిజామాబాద్ సిటీ ,నవంబర్ (ప్రభన్యూస్)9:తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రజా సంక్షేమం అభివృద్ధి దేంగా కృషి చేశారని, నిజామాబాద్ నగరాన్ని ఎంతో సుందరంగా తీర్చిదిద్ది అభివృద్ధి సంక్షేమమే ధ్యేయంగా కృషి చేశానని అర్బన్ ఎమ్మెల్యే, బిఆర్ఎస్ అర్బన్ అభ్యర్థి గణేష్ విగాల అన్నారు. నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గం బి.ఆర్.ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి గా గణేష్ బిగాల నామినేషన్ దాఖలు చేశారు.
గణేష్ బిగాల బి.ఆర్.ఎస్ పార్టీ అభ్యర్థిగా నామినేషన్ వేస్తున్న శుభ సందర్భంగా మాతృమూర్తి సువర్ణ మాల, అమ్మమ్మ దీవెన లు తీసుకున్నారు. అనంతరంఅయ్యప్ప స్వామి ఆలయం, నాందేవ్ వాడ శ్రీ విఠలేశ్వర ఆలయం, మాక్లూర్ గ్రామం లోని శ్రీ పాండు రంగ విఠలేశ్వర ఆలయం లో ప్రత్యేక పూజలు చేశారు.అనంతరం మున్సిపల్ కార్యాలయం లో రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు అందచేశారు
. ఈ సందర్భంగా గణేష్ బిగాల మాట్లాడుతూ గత తొమ్మిది సంవత్సరాల క్రితం నిజామాబాద్ నగరం ఏ విధంగా ఉందో.. ప్రస్తుతం ఏ విధంగా అభివృద్ధి చెందిందో.. ప్రజలు ఒక్కసారి ఆలోచిం చాలని తెలిపారు. నిజామాబాద్ నగరాన్ని మరింత అభివృద్ధి చేసి చూపిస్తా ఒక్కసారి అవకాశం ఇచ్చి ఆలోచించండి అని కోరారు
.ఈ కార్యక్రమంలో బి.ఆర్.ఎస్ పార్టీ ఎన్నారై గ్లోబల్ కో ఆర్డినేటర్ శ్రీ మహేష్ బిగాల,నగర మేయర్ శ్రీమతి దండు నీతు కిరణ్ ,బి.ఆర్.ఎస్ నాయకులు అలీం, నుడ చైర్మన్ ప్రభాకర్ రెడ్డి,సుజిత్ సింగ్ ఠాకూర్, సూదం రవి చందర్, సత్య ప్రకాష్,సిర్ప రాజు,యెనుగందుల మురళి,రాజేంద్ర ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.