Saturday, January 4, 2025

Nizamabad – నడిరోడ్డులో బోరు .. కబ్జాదారుడికి నోటీసులు

నిజామాబాద్ జిల్లా ప్రతినిధి (ఆంధ్రప్రభ): నిజామాబాద్ జిల్లా కేంద్రం లోని మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో నిత్యం రద్దీగా ఉం డే ప్రాంతంలో ఏకంగా రోడ్డు ని తవ్వేసి నడిరోడ్డుపై బోరు వేసిన కబ్జాదారుడీకి నిజా మాబాద్ నగరపాలక సంస్థ నోటీసులు జారీ చేసింది. నిజామాబాద్ నగరంలోని దేవి మందిర్ రోడ్డు ప్రాం తంలో అడుగు తీసి అడుగు వేయలేని రద్దీగా ఉండే ఈ ప్రాంతంలో తన ఇంటి ముం దు ఉన్న రోడ్డుని తవ్వేసి ఏకంగా నడిరోడ్డుపై బోరు వేసి ఇంటి నీటి కోసం కనెక్షన్ ఇచ్చి దర్జాగా రోడ్డుని కబ్జా చేశాడు ఓ ఘనుడు. అంతే కాకుండా గుట్టు చప్పుడు కాకుండా రాత్రిపూట 3 రోజు లు బోరు నిర్మాణ పనులు పనులు చేపట్టడం శోచనీ యం.

ఈ విషయమై కార్పొ రేషన్ దృష్టికి వెళ్లగా.. అప్ప టి కార్పొరేషన్ కమిషనర్ మక రంద్ వెంటనే స్పందించి బోరు నిర్మాణ పనులు వెంటనే ఆపి వేయాలని జూన్ లో సదరు కబ్జా దారునికి మొదటిసారి నోటీ సులు అందజేశారు. బోరు నిర్మాణ పనులు చేప డు తుండగా కబ్జాదారుకి జూన్ 5వ తేదీన మొదటి సారి నోటీసులు అంద జేశారు. కానీ సదరు కబ్జాదారుడు నోటీసులను సైతం పట్టిం చుకోకుండా కమిషనర్ ఆదేశాలను బేఖాతరు చే స్తూ… నోటీసులు ఇచ్చిన అనంతరం అవేమీ పట్టించు కోకుండా బోరు నిర్మాణ పనులను చక చకా పూర్తి చేశారు.

ఈ ఘటన జరిగి ఆరు నెలలు కావస్తున్న బల్ది యా సదరు కబ్జాదారుడుపై ఎలాంటి చర్యలు తీసు కోవ డం లేదని పత్రికలో వచ్చిన కథనంపై నగరపాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్ వెంటనే స్పందించి సదరు కబ్జా దారుడికి రెండోసారి నోటీసులు అందజేశారు. అక్ర మంగా రోడ్డుని కబ్జా చేసి బోరు వేసిన ఘటనపై కార్పొ రేషన్ కమిషనర్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ 7 రోజుల్లో రోడ్డు పై వేసిన బోరుని వెంట నే తొలగించాలంటూ నోటీ సులు జారీ చేశారు. ఇప్ప టికైనా బల్దియా జారీ చేసిన నోటీసులకు అక్రమంగా రోడ్డుపై వేసిన బోరు తొలగించేనా వేచి చూడాల్సిందే .

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement