నిజామాబాద్ సిటీ, నవంబర్ (ప్రభ న్యూస్)5: గత కొన్ని సంవత్సరాలుగా క్రితం నా తల్లిదండ్రుల జ్ఞాప కార్థం ట్రస్టుని ఏర్పాటు చేసి నిజామాబాద్ అర్బన్ ప్రజలకు సేవలు అందిస్తున్నానని సేవ చేయడం ఎంతో సంతృ ప్తినిస్తుందని బిజెపి అర్బన్ అభ్యర్థి దన్ పాల్ సూర్య నారాయణ అన్నారు. ఒక్కసారి ఆలోచించి అర్బన్ ప్రజలు అవకాశం ఇచ్చి ఆశీర్వదిం చండి అని కోరారు. ఆదివారం నిజామాబాదు నగరం లో 8 వ డివిజన్ లోని సాయినగర్ -2 లో బీజేపీ అభ్యర్థి దన్ పాల్ సూర్య నారాయణ ఇంటి ఇంటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా డివిజన్ కు వచ్చిన ధన్పాల్ సూర్యనారాయణకు పెద్ద ఎత్తున ఆడపడుచులు మంగళ హారతులతో పూలవర్షం కురిపించి ఘనంగా స్వాగతం పలికి బ్రహ్మరథం పట్టారు.. ప్రజల నుండి ధన్పాల్ కి పెద్ద ఎత్తున మద్దతు ఇచ్చారు.ఈ సంద ర్బంగా సూర్యనారాయణ మాట్లాడుతూ నాకు ఒక్క సారి అవకాశం ఇస్తే నగరాన్ని సుంద రికరణ చేస్తానని అన్నారు. కబ్జాలు, అవినీతి లేని పాలనా అందచేస్తా అన్నారు.
ఈ కార్యక్రమం లో 8 వ డివిజన్ శక్తి కేంద్ర ఇంచార్జి మఠం పవన్, వరలక్ష్మి, రవి, విజయ్, చిరంజీవి,మున్సిపల్ ఫ్లోర్ లీడర్ గోపిడి స్రవంతి రెడ్డి, అసెంబ్లీ కన్వీనర్ పంచారెడ్డి లింగం, మండల అధ్యక్షులు పుట్ట వీరేందర్, కార్పొరేటర్లు సుక్క మధు, కిషోర్ బంటు రాము, మెట్టు విజయ్, ఇల్లేందుల ప్రభాకర్, బుసపూర్ శంకర్, కోడూరు నాగరాజు, బీజేపీ నాయకులు డివిజన్ వాసులు పాల్గొన్నారు