Saturday, September 14, 2024

Nizamabad – ఎసిబి వలలో కార్పొరేషన్ అవినీతి జలగ..

ఇన్చార్జ్ రెవెన్యూ అధికారి నరేందర్ ఇంట్లో ఏసీబీ సోదాలు..
గతంలో వృద్ధురాలి పెన్షన్ డబ్బులు కాజేయడం పై సస్పెన్ కు గురైన వైనం..
గత సంవత్సరం బోధన్ కు బదిలీ అయిన రాజకీయ అండదండలతో బదిలీ కానీ ఘనుడు…

నిజామాబాద్ ప్రతినిధి (ప్రభ న్యూస్) : ప్రజా సేవే పరమావధిగా పని చేయాల్సిన ప్రభుత్వ ఉద్యోగులు లంచగొండులుగా మారుతున్నారు. ప్రభుత్వం నుంచి నెల నెల వేతనాలు తీసుకుంటూనే సులువుగా డబ్బు సంపాదించేందుకు అడ్డదారులు తొక్కుతున్నారు. నిజాంబాద్ నగరంలోని బసవ గార్డెన్ వద్ద గల అశోక టవర్స్ లో నివాసముంటున్న నిజామాబాద్ మున్సి పల్ కార్పొరేషన్ లో సూపరింటెండెంట్, ఇన్చార్జి రెవెన్యూ అధికారి నరేందర్ ఇంట్లో శుక్రవారం తెల్లవారుజామున నుంచి ఏసీబీ అధికారులు సోదాలు చేస్తున్నారు. ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయని ఫిర్యాదు మేరకు ఏసీబీ అధికారులు సోదా చేస్తున్నట్లు సమాచారం.

బిల్ కలెక్టర్ గా ఉద్యోగ ప్రస్థానం ప్రారంభమై

- Advertisement -

1996 సంవత్సరంలో కారుణ్య నియామకాల్లో భాగంగా బిల్ కలెక్టర్ గా కార్పొరేషన్ లో ఉద్యోగ ప్రస్థానం ప్రారంభించి ఆర్ఐగా, సూపరింటెండెంట్ గా, ఇన్చార్జి రెవెన్యూ అధికారులుగా అంచలంచలుగా పదోన్నతలు పొందాడు. అంతేకాకుండా గత సంవత్సరంలో బోధన్ కు బదిలీ అయినా కూడా రాజకీయ అండదండలతో బదిలీ కాలేదని సమాచారం.

వృద్ధురాలి పింఛన్ కాజేయడంతో సస్పెన్స్ కు గురైన వైనం..

గతంలో అప్పటి కలెక్టర్ యోగితా రాణి ఉన్నప్పుడు రెవెన్యూ బిల్ కలెక్టర్ గా నరేందర్ విధులు నిర్వర్తిస్తున్నాడు. ఆ సమయంలో ఓ వృద్ధురాలికి సంబంధించి న పెన్షన్ డబ్బులు కాజేసినట్లు నిరూ పణ కావడంతో ఇందుకు సంబంధించి సదరు నరేందర్ సస్పెన్స్కు గుర య్యాడు.ప్రస్తుతం నరేందర్ ఇంట్లో ఏసీబీ అధికారుల సోదాలు కొనసా గుతున్నా యి. సోదాల అనంతరం పూర్తి వివరాలను ఏసీబీ అధికారులు వెల్లడించనున్నారు

Advertisement

తాజా వార్తలు

Advertisement