Friday, November 22, 2024

నిజాం సాగ‌ర్ నిర్మాణం ఓ ప్ర‌జా ఉద్య‌మం

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: ఉత్తరతెలంగాణ బీడుభూ ముల్లో పసిడి పంటలు పండిస్తున్న నిజాంసాగర్‌ నిర్మాణమే ఓఅద్భుతం. ఆయకట్టు రైతులు స్వచ్ఛం దంగా శ్రమదానం చేసి నిర్మించిన ఈ ప్రాజెక్టు సాగునీటి రంగంలో తెలంగాణ చరిత్ర సుసంపన్నం చేస్తుంది. నిజాం రాజుల దార్శినికత, పాలనా దక్షతకు తరతరా లకు చెదరని జ్ఞాపకంగా మిగిలింది. రెండుపంటలను పండిస్తున్న నిజాం సాగర్‌ చరిత్రలోకి తొంగిచూస్తే తెలంగాణ రైతాంగం చేసిన శ్రమదానం, నిజాం రాజు మీర్‌ ఉస్మాన్‌ అలీఖాన్‌ దూరదృష్టి కనిపిస్తుంది. ఈ ప్రాజెక్టు నిర్మాణంతో నిజమాబాద్‌ రూపురేఖలు మారిపో యాయి. వరి, ఆరుతడి పంటలతో పాటుగా వేలాది ఎకరాల్లో చెరువుకు పంటకు నీటి కొరత లేకపో వడంతో వ్యవసాయంతో పాటు పారిశ్రామికంగా నిజాంసాగర్‌ తనఉనికిని పదిలప ర్చుకుంది. నిజాం సాగర్‌ నీటితో పండిన చెరుకుఆధారిత పరిశ్రమలో ఆనాడు మూడువేల టన్నుల క్రషింగ్‌ సామర్థ్యం ఉండేది. సంవత్సరానికి ఏడు లక్ష టన్నులు ఉత్పత్తి చేసేవారు. అయితే గత ఉమ్మడిపాలనలో నిజాంచెక్కర పరిశ్రమను ప్రైవేటుపరంచేసి నిజాంసాగర్‌ సహజ త్వానికి గండి కొట్టారు. నీటి నిల్వ సామర్థ్యం తగ్గిపోయి పంటపొలాలకు నీరు అందించడమే ప్రశ్నార్థకంగా మారి ఈ ప్రాజెక్టు 17.802 టీఎం సీల నుంచి 0.828 టీఎం సీలకు చేరుకోవడంతో ప్రాజెక్టు పై ఆధారపడిన రైతులబతుకులు ప్రశ్నార్థకమయ్యాయి. శ్రమదానం తో రైతులు నిర్మించుకున్న ఈ ప్రాజెక్టు నీరు లేక విలవిలపోయి పంటపొలాలు బీల్లుగా మారుతుంటే తట్టుకోలేని రైతులు ఉసురుతీసుకున్నారు. సమక్య పాలకుల దాష్టీకానికి రైతులు బలయ్యారు. అయితే తెలంగాణ ఆవిర్భావం అనంతరం నిజాం సాగర్‌ పునర్‌ నిర్మాణానికి అధికప్రాధాన్య ఇవ్వడంతో పాటుగా కాలువల పునరుద్ధణతో నిజాం రూపురేఖలు మారిపో యాయి.


నాటి నిజాం రాజ్యంలో నిజమాబాద్‌ జిల్లా లోని మంజీరానదిపై అచ్చంపేట గ్రామం దగ్గర నిజాం సాగర్‌ నిర్మించారు. నిజాం రాజ్యంలో మంజీరానది అంతరాష్ట్ర నదికాదు. మంజీరానది పరివాహక ప్రాం తాలు కర్ణాటక, మరాట్వాడా హైదగరాబాద్‌ లో అంతర్భాగాలు. అంతరాష్ట్ర సమస్యలు ఉత్వన్నం కాలేదు. 1923 సెప్టెంబర్‌ లొ 19లో  ఏడవనిజాం మీర్‌ ఉస్మాన్‌ అలీఖాన్‌ పరిపాలనా అనుమతులు మంజూరు చేయగా చీఫ్‌ ఇంజనీర్‌ అలీనవాజ్‌ జంగ్‌ నిర్మాణ బాధ్యతలు చేపట్టారు. ఈ ప్రాజెక్టును 1933 మార్చి 23 న పూర్తి చేశారు. నిర్మాణం చేపట్టి వందసంవత్సరాలు అవుతున్నా నిర్మించి గురువారం నాటికి తొంభై సంవత్సరాలు పూర్తి అయిన ఈ ప్రాజెక్టు నిజాం బాద్‌ ప్రాంత అభివృద్ధిలో కీలకం డ్యాం పనులు 1930 నాటికే పూర్తి అయినప్పటికీ 60 మైల్ల ప్రధాన కాలువ 1933లో పూర్తికాగానే పంటపొలాల్లో మంజీర జలసవ్వడులు ప్రారంభమై పసిడిపంటలతో నిజమాబాద్‌ సింగారించుకుంది.
ప్రాజెక్టు నిర్మాణలో రైతులు కూలీ లుగా స్వచ్ఛందంగా పనిచేశారు. యంత్రసామాగ్రిని ఉపయోగించకుండా ఎడ్డల బళ్లతోనే ఇసుక, సిమెంట్‌ ఇనుము తరలించారు. చేసిన పనికి వేతనం తీసుకో కుండా తరతరాలుగా చెక్కుచెదరని నిజాం సాగర్‌ నిర్మాణంలో స్థాని కులు శ్రమదానం చేసి నిర్మించిన ఈ ప్రాజెక్టును గత ఉమ్మడిపాలకులు నిర్లక్ష్యం చేసినా తెలంగాణ ప్రభుత్వం ప్రాజెక్టు సామర్థ్యం పెంచి పునర్‌ నిర్మాణ పనులు నిర్వహించి రెండుపటంటలకు నీరు అందిస్తుంది. ప్రస్తుతం యాసంగిలో 9 పర్యాయాలు నీటిని విడుదల చేసేందుకు నీటి ప్రణాళిక సిద్ధంచేసి ప్రస్తుతం ఐదుపర్యాయాలు నీటిని విడుదల చేశారు.
ఆధునిక యంత్రాలను ఉపయోగించకుండా పూర్తిగా రైతుల శారీరక శ్రమ, శ్రమదానంతో నిర్మించి నిజాం రాజ్యంలోని ప్రధాన ఇంజనీర్‌ అలీ నవాజ్‌ జంగ్‌ చరిత్రను సృష్టించారు. అయితే శ్రమదానం చేసిన రైతులకు వైద్యసదుపాయాలు, భోజన సౌకర్యాలను నిజాం రాజు కల్పించారు.
ప్రాజెక్టు నిర్మాణంతో శ్రమిం చిన రైతుల పొలాలతో పాటుగా గ్రామాలకు గ్రామాలే పచ్చని పంటపొలాలకు కేంద్రమైంది. నిర్మాణ జరిగినప్పుడు నిజాంసాగర్‌ నీటిసామర్థ్యం 29.70 టీఎం సీలు, రాతి డ్యాం పొడుగు 1.100 అడుగులు, జలాశయం విస్తీర్ణం 50 చదరపుమైళ్లు, సిల్ఫ్‌ వే గేట్లు 28కాగా ఆయకట్టు 2.75 లక్షల ఎకరాలు ప్రధాన కాలువ పొడుగు 72.50మైల్లు గా నిర్మించారు.
అయితే నిజాంరాజ్యం భారతదేశంలో విలీనం కావడం సమైక్య పాలకులు అధికారం లోకి రావడంతో ప్రాజెక్టుకు నిర్లక్ష్యం నీడలు కమ్ముకున్నాయి. సింగూరు డ్యాం ఎగువన మహారాష్ట్ర ప్రాజెక్టులు నిర్మాణతో 17 టీఎం సీలకు పడిపోయింది. అయితే తెలంగాణ ప్రభుత్వం ప్రాజెక్టును పునర్‌ నిర్మించి కాలువల సామర్థ్యం పెంచి అవసరమైతే ఎత్తిపోతలద్వారా నీటిని నింపడానికి పనులు పూర్తి చేయ డంతో ప్రస్తుతం నిజాంసాగర్‌ పూర్వ వైభవం పునికిపుచ్చుకుని పంటపొల్లాల్లోపసిడిపంటలను పండిస్తుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement