- అనంతపేట కేజీబీవీలో సంఘటన
- ఉడకని అన్నమం తినడమే కారణం
ఆంధ్రప్రభ స్మార్ట్, నిర్మల్ : జిల్లాలోని అనంతపేట కేజీబీవీలోని అన్నం తిన్న పది మంది బాలికలు వాంతులు, కడుపు నొప్పితో బాధపడ్డారు. శనివారం ఈ సంఘటన జరిగింది. విద్యార్థినులు అస్వస్థతకు గురైన విషయం తెలుసుకున్న సిబ్బంది వెంటనే ఆస్పత్రికి తరలించారు. అందులో ఐదుగురు పరిస్థితి బాగుందని పాఠశాలకు పంపించారు. మిగిలిన ఐదుగురికి వైద్యులు సేవలు అందిస్తున్నారు. ఆస్పత్రిలో ఉన్న విద్యార్థినులను ఎంఈఓ వెంకటేశ్వర్లు పరామర్శించి వారి ఆరోగ్య పరిస్థితి తెలుసుకున్నారు.
ఉడకని అన్నమే కారణం…
కేజీబీవీలో ఉడకని అన్నం పెట్టడం వల్లే బాలికలకు కడుపు నొప్పి, వాంతులు వచ్చాయని తెలిసింది. ఈ విషయాన్ని ఎంఈఓ వెంకటేశ్వర్లు వద్ద ప్రస్తావించగా, కుక్ కొత్తగా రావడం వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందన్నారు. సరిగ్గా వంట రాకపోవడంతో ఉడకని అన్నం పెట్టారన్నారు. నాణ్యమైన భోజనం పెట్టేలా చర్యలు తీసుకుంటానని చెప్పారు.