Friday, November 22, 2024

Nirmal – జలదిగ్బంధనంలో మహాత్మాజ్యోతిబాపులే పాఠశాల

ముందస్తుగా 5,6,7 తరగతుల విద్యార్థులు ఇంటి ముఖం

  • పాఠశాల ముందు మోకాలివరకు వరద నీరు
  • రెండు రోజుల భారీ వర్షాల కారణంగా మూడు తరగతులకు సెలవు

ముధోల్, సెప్టెంబర్ 1 (ప్రభన్యూస్)

నిర్మల్ జిల్లా ముధోల్ మండలకేంద్రంలోని సాయిమాధవ నగర్ కాలనీలోని మహాత్మాజ్యోతిబాపులే పాఠశాల శనివారం సాయంత్రం నుండి ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షానికి ఆదివారం ఉదయం జలదిగ్బంధనమయినది. ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపాల్ అమృతను ప్రభన్యూస్ వివరణ కోరగా నిన్న సాయంత్రం నుండి కురిసిన భారీ వర్షం కారణంగా వరద నీరు పాఠశాల లోపల, చుట్టూ చేరడం వలన వరదతో పాటు విషసర్పాలు వచ్చే అవకాశం ఉందని అన్నారు. సొసైటీ సెక్రెటరీ సూచన మేరకు విద్యార్థులకు ముందస్తు జాగ్రత్తగా ఎటువంటి ప్రమాదాలు సంభవించకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారని తెలిపారు. ఇందులో భాగంగా 5,6,7 (మూడు తరగతుల) విద్యార్థులను ఇంటికి పంపుతున్నామని తెలిపారు.

లోతట్టు గ్రామల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.. ఎస్ఐ రాహుల్ …

- Advertisement -

నిర్మల్ జిల్లా దస్తూరాబాద్ ప్రభ న్యూస్..
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వల్ల అధికంగా వర్షాలు గురించి అవకాశం ఉన్నందున నిర్మల్ జిల్లా దస్తూరాబాద్ మండలంలోని గోదావరి పరివాహక ప్రాంతమైన భూత్కూర్ దేవునిగూడెం గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, చేపల వేట చేసేవాళ్ళు , గొర్ల కాపర్లు గోదావరి తీరానికి వెళ్లకుండా ఉండాలని ఎస్ఐ రాహుల్ సూచించారు . ఈ సందర్భంగా గ్రామాలకు వెళ్లి ప్రజలకు అవగాహన కల్పించారు. అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని, ఏదైనా అత్యవసర పరిస్థితిలో ఏర్పడినప్పుడు 100 డయాల్ చేయాలని సూచించారు. ప్రజలు పోలీసు వారి సూచనలు పాటించి సహకరించాలని కోరారు.

మత్తడి వాగు ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు

  • 3 గేట్లు ఎత్తి నీటి విడుదల

తాంసి సెప్టెంబర్ 1 (ప్రభ న్యూస్) : గత రాత్రి నుంచే ఏడ తెరిపి లేకుండా కురుస్తున్న బారి వర్షానికి తాంసి మండలంలోని వడ్డడి మత్తడి వాగుప్రాజెక్టు లోకి భారీగా వరద నీరు చేరడంతో శనివారం రాత్రి 2 గేట్లు ఎత్తి 4515 క్యూసెక్కుల నీరు విడిచిపెట్టగా…ఇన్ ఫ్లో పెరగడంతో ఆదివారం ఉదయం 3 గేట్లు ఎత్తి నీరు వదిలినట్లు ప్రాజెక్టు అధికారి  హరీష్ వెల్లడించారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 277.50 అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం  277.20 అడుగుల వద్ద కొనసాగుతున్నట్టు అధికారి తెలిపారు.ప్రాజెక్టులోకి ఇన్ఫ్లో 12850 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతొందని ఔట్ ఫ్లో 13645 క్యూసెక్కుల నీరు విడుదల చేస్తున్నట్లు తెలిపారు..దిగువ ప్రాంతాల ప్రజలు,రైతులు అప్రమత్తంగా ఉండాలని పరివాహక ప్రాంతాల ప్రజలు అటువైపు వెళ్లవద్దని సూచించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement