నిర్మల్ ప్రతినిధి , జూలై 11: ప్రభ న్యూస్ )నిర్మల్ నియోజకవర్గానికి చెందిన పలువురు బీఆర్ఎస్ నాయకులు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఆద్వర్యంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను మర్యాదపూర్వకంగా కలిసారు. నిర్మల్ మాజీ మున్సిపల్ చైర్మన్ అప్పాల గణేష్ తో పాటు ఇతర నేతలు బీజేపీని వీడి గులాబీ గూటికి చేరుతున్న నేపథ్యంలో ఈ భేటీ జరిగింది. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలుపుకు సమిష్టిగా కృషి చేయాలని ఈ సందర్భంగా కేటీఆర్ పిలుపునిచ్చారు. పని చేసే వారిని బీఆర్ఎస్ పార్టీ గుర్తించి సముచిత స్థానం కల్పిస్తుందని తెలిపారు. నిర్మల్ మున్సిపాలిటీ అభివృద్ధికి తమ తోడ్పాటు ఎప్పుడు ఉంటుందని ఆయన భరోసానిచ్చారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ దండే విఠల్, బీఆర్ఎస్ నాయకులు లోక భూమారెడ్డి, గండ్రత్ ఈశ్వర్, ఎర్రవోతు రాజేందర్, రాంకిషన్ రెడ్డి, అల్లోల గౌతంరెడ్డి, ధర్మాజీ రాజేందర్, రామేశ్వర్ రెడ్డి, మారుగొండ రాము, నేరేళ్ళ వేణు తో పాటు మాజీ మున్సిపల్ చైర్మన్ అప్పాల గణేష్ ఆయన అనుచరులు కౌన్సిలర్ కత్తి నరేందర్, సైండ్ల శ్రీధర్, మాజీ కౌన్సిలర్లు చందుపట్ల రవి, తోట నర్సయ్య, గోపు గోపి, నేల అరుణ్ కుమార్, సాకీర్, అలీం, తదితరులు పాల్గొన్నారు.
రేపు గులాబీ గూటికి అప్పాల గణేష్
నిర్మల్ మాజీ మున్సిపల్ చైర్మన్ అప్పాల గణేష్ ఆయన అనుచరులు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి సమక్షంలో బుధవారం బీఆర్ఎస్ పార్టీలో చేరనున్నారు. బైల్ బజార్ వ్యవసాయ మార్కెట్ కార్యాలయం నుంచి దివ్యా గార్డెన్ వరకు భారీ బైక్ ర్యాలీ నిర్వహించనున్నారు. అప్పాల గణేష్ తో పాటు కౌన్సిలర్లు, మాజీ కౌన్సిలర్లు, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు చెందిన కార్యకర్తలు, యువకులు, కుల సంఘాల నేతలు గులాబీ కండువా కప్పుకోనున్నారు.