నిర్మల్ ప్రతినిధి జులై 21 ప్రభ న్యూస్ – నేటి వేకువ జామున హైదరాబాద్ నుండి నాగపూర్ కి వెళ్తున్న కారు మహబూబ్ ఘాట్ లో దారి కనిపించక, అదుపు తప్పి లోయలో పడిపోయింది. నిర్మల్ కంట్రోల్ రూమ్ కి సమాచారం రావడంతో, వెంటనే అప్రమత్తం అయిన నిర్మల్ డిఆర్ఎస్ బి ఇన్స్పెక్టర్ గోపినాథ్ , ఎస్ఐ సారంగాపూర్ శ్రీకాంత్ తమ సిబ్బందితో సంఘటనా స్థలానికి వెళ్లారు..
కారు లో ఉన్న రాధా కృష్ణ ,ఆయన భార్య, కుమారుడిని లోయలో పడిన కారులోంచి బయటకు తీశారు… ముగ్గురికి స్వల్ప గాయాలు అయ్యాయి. హైదరాబాద్ సరూర్ నగర్ కి చెందిన వారిని నిర్మల్ ప్రభుత్వ ఆసుపత్రి కి చికిత్స నిమిత్తం పంపినారు. ఇక ముగ్గురు ప్రాణాలు కాపాడిన ఇన్స్పెక్టర్ గోపీనాథ్, ఎస్ఐ శ్రీకాంత్ , పోలీసు సిబ్బందిని జిల్లా ఎస్పీ డా.జానకి షర్మిల అభినందించారు .