నిర్మల్ ప్రతినిధి డిసెంబర్ 18 ప్రబా న్యూస్) నిర్మల్ జిల్లా కేంద్రంలోని ప్రియదర్శని నగర్ వీధిలో గల సోమవారం సహాయ కార్మిక శాఖ అధికారి కె సాయిబాబా నివాసంలో ఏసీబీ అధికారుల లంచం తీసుకుంటూ చిక్కాడు. కడెం మండలం పెద్ద బిళ్ళలు గ్రామానికి చెందిన గంగన్న అనే వ్యక్తి ద్వారా లేబర్ ఆఫీసర్ కొడుకు దామోదర్ 25వేల రూపాయల లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్గా దొరికారు, లంచం తీసుకుంటున్న 25 వేల రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు .
ఈ సందర్భంగా ఏసీబీ డిఎస్పి వివి రమణమూర్తి మాట్లాడుతూ , కడెం మండలం పెద్దపల్లి గ్రామానికి చెందిన గంగన్న తన తల్లి రిజిస్టర్డ్ లేబర్ గా విధులు నిర్వహిస్తూ మరణించారు.. దీంతో ఆమెకు నష్టపరిహారంగా లక్ష 30 వేల రూపాయల ప్రభుత్వం నుంచి రావాలిసి ఉంది.. ఆ బెనిఫిట్ ఫైల్ ను జిల్లా కార్మిక శాఖ అధికారికి పంపేందుకు 30 వేల రూపాయలను డిమాండ్ చేశారు సాయి బాబా.. అయితే తగ్గించమని కోరడంతో 25 వేల రూపాయలు ఇవ్వాలని చెప్పారు.. దీంతో ఈ సమాచారాన్ని గంగన్న ఎసిబికి ఇచ్చారు.. దీంతో ఈరోజు మధ్యాహ్నం సమయంలో నిర్మల్ జిల్లా కేంద్రంలోని ప్రియదర్శిని నగర్ వీధిలో గల అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ సాయిబాబా ఇంటి వద్ద సాయిబాబా కుమారుడు దామోదర్ కు గంగన్న 25 వేల రూపాయల లంచం అందజేశాడు. ఇదే సమయంలో ఏసీబీ అధికారులు రైడ్ చేసి అతడిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.. ఈ కేసులో అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ సాయిబాబాను అతని కుమారుడు దామోదర్ ను అరెస్ట్ చేసి కరీంనగర్ లోని సెంట్రల్ జైలుకు తరలిస్తున్నట్లు ఏసిబి డిఎస్పి రమణమూర్తి తెలిపారు .