హైదరాబాద్ సిటీలో ఉన్న నిమ్స్ సరికొత్త రికార్డు సృష్టించింది. భారతీయ ఆరోగ్య సంరక్షణలో చెప్పుకోదగ్గ రికార్డును నెలకొల్పింది. ఇవ్వాల (శుక్రవారం0 100వ కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్ చికిత్సను నిమ్స్ డాక్టర్లు సక్సెస్ చేశారు. అవయవ మార్పిడి ద్వారా ఎంతోమంది ప్రాణాలను కాపాడుతూ.. అసాధారణ మైలురాయికి చేరుకోవడం గొప్ప విషయమని మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. ఈ ఒక్క నెలలోనే 30 రోబోటిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహించినట్లు ఆయన తెలిపారు.
ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రపంచంలోని అత్యుత్తమ, అధునాతన వైద్య సేవలను నిరుపేదలకు అందిస్తున్నామని మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. తెలంగాణను ఆరోగ్య తెలంగాణగా మారుస్తున్న సీఎం కేసీఆర్ అంకితభావంతో ఇదంతా సాధ్యమైందని అన్నారు. ఈ అద్భుత విజయం సాధించిన సందర్భంగా నిమ్స్ డైరెక్టర్, డాక్టర్లు, ఇతర సిబ్బందికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుపుతున్నట్లు మంత్రి హరీశ్‌రావు ట్విట్టర్ (ఎక్స్)లో పేర్కొన్నారు.