హైదరాబాద్: నిమ్స్‌లో నర్సులు నేడు విధుల బహిష్కరించి ధర్నాకు దిగారు. విధులకు సరిగా హాజరుకావడం లేదంటూ పలువురికి ఇటీవల నిమ్స్ డైరెక్టర్ బీరప్ప మెమోలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో నర్సులు విధులు బహిష్కరించి ఆందోళనకు దిగారు. నర్సుల ఆందోళనతో ఎలెక్టివ్ సర్జరీలు నిలిచిపోయాయి. ఎమర్జెన్సీ సర్జరీలకు సైతం ఆటంకం ఏర్పడింది. దీంతో రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీనిపై ఏర్పాటు చేసిన త్రిసభ్య కమిటీతో నిమ్స్ డైరెక్టర్ బీరప్ప సమావేశమయ్యారు. మరోవైపు త్రిసభ్య కమిటీతో చర్చలకు నర్సింగ్ సిబ్బంది నిరాకరించారు. తక్షణమే మెమోలనును వెనక్కి తీసుకుంటేనే విధులకు హాజరవుతామని నర్సులు స్పష్టం చేశారు. ఈ సమ్మె చట్టబద్దం కాదంటూ నిమ్స్ అధికారులు ప్రకటించారు.. తక్షణం సమ్మెను విరమించిన విధులకు హాజరుకావాలని కోరారు..
Advertisement
తాజా వార్తలు
Advertisement