టిఎస్ ఆర్టీసీ కీలక నిర్ణయం
నగరంలోని అన్ని ప్రాంతాల నుంచి ప్రత్యేక బస్సులు
నిమజ్జనం రోజున
హైదరాబాద్ – గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో రేపు జరగనున్న గణేశ్ నిమజ్జనోత్సవం, శోభాయాత్ర సందర్భంగా తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. గణేష్ నిమజ్జనోత్సవం సందర్భంగా భక్తుల రాకపోకలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా భారీగా ప్రత్యేక బస్సులను నడపనుంది. వినాయక నిమజ్జనోత్సవం సందర్భంగా ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాలకు 600 ప్రత్యేక బస్సులను నడపనున్నట్లు టీజీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తెలిపారు. జీహెచ్ఎంసీ పరిధిలో ఒక్కో డిపో నుంచి గరిష్టంగా 30 నుంచి కనీసం 15 బస్సులను నడపనున్నట్లు తెలిపారు. ఈ సర్వీసులను భక్తులు వినియోగించుకుని గణేశ్ నిమజ్జనోత్సవంలో పాల్గొలని భక్తులకు విజ్ఞప్తి చేశారు. అలాగే సాధారణ సర్వీస్ లను సైతం ట్యాంక్ బండ్ వరకు నడుస్తామని పేర్కొన్నారు.