హైదరాబాద్, ఆంధ్రప్రభ: మన ఊరు-మన బడి, మన బస్తీ పాఠశాలలకు తాత్కాలిక పద్ధతిలో నైట్ వాచ్మెన్లు నియమించేందుకు పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. మన ఊరు మన బడి కార్యక్రమంలో భాగంగా శిథిలావస్తకు చేరిన సర్కారు పాఠశాలలను సర్వాంగ సుందరంగా అన్ని రకాల మౌలిక వసతులను కల్పిస్తోంది. పాఠశాలల్లో ఉండే విలువైన పరికరాలు, సామగ్రికి రక్షణా లేకుండా పోవడంతో ఈమేరకు ఆయా పాఠశాలలకు నైట్ వాచ్మెన్లను నియమించనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 1982 పాఠశాలల్లో వీరిని నియమించేలా చర్యలు తీసుకోవాలని జిల్లా అధికారును పాఠశాల విద్యాశాఖ కమిషనర్ శ్రీదేవసేన ఉత్తర్వుల్లో తెలిపారు. వీరికి నెలకు రూ.5వేలు గౌరవ వేతనం ఇచ్చేలా నియామకాలు జరపాలని, స్కూల్ మేనేజ్మెంట్ కమిటీల ద్వారా వాచ్మెన్ల నియామకం చేపట్టాలని సూచించారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement