Friday, December 13, 2024

ADB |ఉట్నూర్ లో మంత్రి సీతక్క రాత్రి బస..

ఉట్నూర్, డిసెంబర్ 13 (ఆంధ్రప్రభ) : తెలంగాణ రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణ అభివృద్ధి, శిశు సంక్షేమ, జిల్లా ఇన్చార్జ్ మంత్రి దనసరి అనసూయ సీతక్క శుక్రవారం ఖానాపూర్ నియోజకవర్గంలో పర్యటించి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలతో పాటు పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. అనంత‌రం ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ కేబి కాంప్లెక్స్ లో రాత్రి బస చేస్తారని అధికార వర్గాలు తెలిపారు.

శనివారం ఉదయం శ్యాంపూర్, లక్కారం గ్రామాల్లో అంగన్వాడీ భవనాల నిర్మాణానికి భూమిపూజ, బీటీ రోడ్ల నిర్మాణానికి భూమిపూజ కార్యక్రమాలు నిర్వహించి అనంతరం ఇంద్రవెల్లి మండలంలో పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాలకు భూమిపూజ చేస్తారని తెలిపారు. అనంతరం ఇంద్రవెల్లి పర్యటన తర్వాత హైదరాబాద్ కు బయలుదేరుతారని అధికారులు పేర్కొన్నారు. మంత్రి వెంట ఖానాపురం ఎమ్మెల్యే వెడమ బోజ్జు పటేల్, ప్రజాప్రతినిధులు, కలెక్టర్ ఐటిడిఎఫ్ఈఓ ఉన్నతాధికారులు, అధికారులు, నాయకులు పాల్గొంటారని తెలిపారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement