Tuesday, November 26, 2024

మెహదీపట్నం వైద్యురాలిని టార్గెట్ చేసిన నైజీరియన్ అరెస్ట్..

సైబర్ నేరగాళ్లు రోజు రోజుకు రెచ్చిపోతున్నారు. అన్ని తెలిసివాళ్లు కూడా ఈ కేటుగాళ్ల మాయలో పడిపోతున్నారు. తాజాగా రూ. 41 లక్షలు మోసం చేసిన సైబర్ నేరస్తున్ని పోలీసులు పట్టుకున్నారు. ఆయుర్వేదిక్ వైద్యురాలిని టార్గెట్ చేసి సైబర్ ఫ్రాడ్స్ కు పాల్పడిన నైజీరియన్ నేరగాన్ని అరెస్ట్ చేశారు. విదేశాలకు హెర్బల్ ముడిపదార్థాల ఎగుమతి పేరుతో వైద్యురాలిని నైజీరియన్ వ్యక్తి మోసం చేశాడు. ఫేస్ బుక్ ద్వారా పరిచయం పెంచుకొని మెహదీపట్నంకి చెందిన ఆయుర్వేద వైద్యురాలు నుంచి రూ.41 లక్షలను కాజేశాడు. ఆయుర్వేదిక్ వైద్యురాలికి ఫోన్ చేసి మూలికల ఫార్ములా తెలిపితే 5 కోట్లు ఇస్తామని బురిడీ కొట్టించాడు. తిరిగి ఆ వైద్యురాలి నుండి ట్యాక్స్ పేరుతో 41 లక్షలు నైజీరియన్ నేరగాడు కాజేశాడు. ముంబై, బెంగుళూర్ లో ఉండి మోసాలు చేస్తున్న నైజీరియన్ నేరగాన్ని అరెస్ట్ చేసి హైదరాబాద్ సైబర్ క్రైమ్ స్టేషన్ కు తరలించారు.

ఈ వార్త కూడా చదవండి: ఊయల తాడు తెగి లోయలో పడ్డారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement