ఫార్మా కంపెనీల కాలుష్యంపై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆగ్రహం వ్యక్తం చేసింది. తెలంగాణకు చెందిన గుమ్మి నరేందర్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ చేపట్టింది ట్రిబ్యునల్. ఫిర్యాదు చేసినప్పటికీ ఫార్మా కంపెనీల కాలుష్యంపై సంబంధిత ప్రభుత్వ విభాగాలు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని పిటిషన్ లో నరేందర్ రెడ్డి పేర్కొన్నారు. దీనిపై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ప్రభుత్వాన్ని నివేదిక కోరింది. తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి, యాదాద్రి-భువనగిరి జిల్లా కలెక్టర్, వ్యవసాయ శాఖ కమిషనర్‌కు ఆదేశాలు జారీ చేసింది. జస్టిస్ కే. రామకృష్ణ, ఎక్స్‌పర్ట్ మెంబర్ కే.సత్యగోపాల్‌తో కూడిన చెన్నై-ఎన్జీటీ బెంచ్ ఈ ఆదేశాలు జారీచేసింది.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..