Friday, September 20, 2024

Next Target Fix – నాలాలపై హైడ్రా ఫోక‌స్ .. నేటి నుంచి సర్వే షురూ

హైద‌రాబాద్ – ఇప్పటి వరకు గ్రేటర్ లో చెరువుల ఎఫ్టీఎల్, బఫర్​జోన్లలో ఆక్రమణలను కూల్చేస్తున్న హైడ్రా ఇప్పుడు నాలాల పై ఫోకస్ పెట్టింది. టోలిచౌకీ , షేక్ పేట్. బల్కాపూర్ నాలాలను నేడు డ్రోన్ల సర్వే చేప‌ట్టారు హైడ్రా సిబ్బంది. బాల్కాపూర్ నాలా గతంలో ఎంత వెడల్పు ఉండే ఇపుడు ఎంత మేర అక్రమణకు గురయ్యిందనేది డ్రోన్ల ద్వారా కొల‌త‌లు తీసుకుంటున్నారు. . ఇరిగేషన్ అధికారులతో కలిసి స‌మ‌న్వ‌యంతో సర్వే చేస్తున్నారు హైడ్రా అధికారులు.

ఇది ఇలా ఉంటే గ్రేటర్ పరిధిలో వెయ్యి కిలో మీటర్ల మేర వర్షపు నీటి కాల్వలుండగా మేజర్ నాలాలు 398 కిలోమీటర్లు, పైపులైన్ డ్రైన్లు, చిన్న సైజు నాలాలు 600 కిలోమీటర్ల వరకు ఉన్నాయి. అయితే కొన్ని ప్రాంతాల్లో నాలాలు పూర్తిగా కనుమరుగయ్యాయి. ప్రస్తుతం ఉన్న నాలాలు చాలా ఏండ్ల కిందట నిర్మించినవి. రోజురోజుకు జనాభా పెరుగుతుండటంతో నాలాల్లోకి వస్తున్న వరద కూడా పెరిగిపోతోంది. మరో వైపు నాలాలు ఆక్రమిస్తుండడంతో వాటిని వెడల్పు చేసే అవకాశం లేకుండా పోతోంది. ఈ నేపథ్యంలో వరద ప్రవాహం పెరిగి కాలనీలు నీటమునుగుతున్నాయి. దీంతో హైడ్రా క‌మిష‌న‌ర్ రంగ‌నాథ్ త‌న దృష్టిని నాలాల‌పై పెట్టారు.. నాలాల స‌ర్వే పూర్తి అయిన త‌ర్వాత వాటిపై ఉన్న ఆక్ర‌మ‌ణ‌లు తొల‌గించేందుకు హైడ్రా స‌మాయ‌త్త‌మ‌వుతున్న‌ది..

Advertisement

తాజా వార్తలు

Advertisement