మంత్రులు తుమ్మల, దుద్దిళ్ల, కోమటిరెడ్డిలకు విషెస్
కొత్త సంవత్సరం సందర్బంగా మొక్కలు బహుమతి
డిజిపి జితేందర్ తో మాటా మంతి
హైడ్రా చేపడుతున్న కార్యక్రమాలపై మంత్రుల అభినందనలు
హైదరాబాద్ – నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని హైడ్రా కమిషనర్ ఎపి రంగనాథ్ నేడు పలువురు ప్రముఖులను కలసి కొత్త ఏడాది శుభకాంక్షలు తెలిపారు.. ముందుగా ఆయన మంత్రి తుమ్మల నాగేశ్వరరావుని కలసి పూల మొక్కను అందజేశారు.. అలాగే ఆయనకు నూతన సంవత్సర శుభకాంక్షలు చెప్పారు..
అలాగే డిజిపి జితేందర్, మంత్రులు కొమటిరెడ్డి వెంకటరెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్ బాబు నివాసాలకు సైతం వెళ్లారు రంగనాథ్.. వారికి పూల మొక్కను ఇచ్చి నూతన సంవత్సర విషెస్ తెలిపారు.. ఈ సందర్బంగా చెరువులు కాపాడటంలో, ప్రభుత్వ భూములలో ఆక్రమణలు తొలగించడంలో ఆయన చేస్తున్న కృషిని రంగనాధ్ ను వారంతా అభినందించారు..