కొత్త సంవత్సరం రోజున సెక్రటేరియట్ లో హంగామా కనిపించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ పార్టీ నేతలు, ప్రముఖులు, అధికారులు కలిసి కొత్త సంవత్స శుభాకాంక్షలు తెలిపారు.. మంత్రి సీతక్క రేవంత్ ను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. రేవంత్ కు ఇందిరా గాంధీ ఫొటోను గిఫ్ట్ గా ఇచ్చారు. మాజీ మంత్రి షబ్బీర్ అలీ రేవంత్ రెడ్డిని కలిసి న్యూ ఇయర్ విషెస్ చెప్పారు. రాష్ట్ర సమాచార, రెవెన్యూ, గృహనిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సిఎం కు విషెస్ చెప్పి మొక్కను బహుకరించారు.. స్పీకర్ ప్రసాద్ కుమార్ , మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్యే యశస్విని తదితరులు రేవంత్ కు పూల బొకే ఇచ్చి ఆంగ్ర సంవత్సర శుభాకాంక్షలు చెప్పారు.. అంతకుముందు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు ఆయన నివాసంలోని సిబ్బంది. నూతన సంవత్సరం సందర్భంగా సచివాలయం వద్ద రేవంత్ రెడ్డి ఫ్లెక్సీలను భారీగా ఏర్పాటు చేశారు
గవర్నర్ కు కొత్త సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన రేవంత్ రెడ్డి
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర గవర్నర్ తమిళి సైని కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. హైదరాబాద్ లోని రాజ్ భవన్ లో నిర్వహించిన ఓపెన్ హౌస్ కార్యక్రమానికి రేవంత్ రెడ్డి హాజరయ్యారు. రేవంత్ రెడ్డి దంపతులు గవర్నర్ తమిళి సైకి పుష్ఫగుచ్చం ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు. రేవంత్ రెడ్డి సీఎం అయిన తర్వాత రాజ్ భవన్ కు వెళ్లడం ఇదే తొలిసారి. రేవంత్ రెడ్డి మంత్రులు కొండా సురేఖ, సీతక్క, స్పీకర్ గడ్డం ప్రసాద్ రాజ్ భవన్ కు వెళ్లారు.