Friday, November 22, 2024

TG: 10వర్సిటీలకు కొత్త వీసీలు… సెర్చ్ క‌మిటీలు ఏర్పాటు…

10వీసీ పోస్టుల‌కు 312 ద‌ర‌ఖాస్తులు
అక్టోబ‌ర్ 3, 4వ తేదీల్లో ద‌ర‌ఖాస్తుల ప‌రిశీల‌న
ద‌స‌రా నాటికి ప్ర‌క్రియ పూర్తి చేయాల‌ని ప్ర‌భుత్వ ఆదేశం


హైద‌రాబాద్ – రాష్ట్రంలోని సర్కార్ యూనివర్సిటీలకు కొత్త వీసీల నియామక ప్రక్రియను ప్రభుత్వం వేగవంతం చేసింది. దసరా నాటికి వీసీల నియామక ప్రక్రియ పూర్తికానుంది. కొత్త వీసీల నియామకం కోసం ఏర్పాటైన సెర్చ్ కమిటీల సమావేశాలు అక్టోబర్ 3నుంచి నిర్వహించాలని నిర్ణయించిన ప్రభుత్వం.. 3, 4 తేదీల్లో షెడ్యూల్ ఖరారు చేసింది.

బాసర ట్రిపుల్ ఐటీ, మహిళా యూనివర్సిటీ మినహా రాష్ట్రవ్యాప్తంగా మిగిలిన 10యూనివర్సిటీలకు ప్రభుత్వం గతంలో సెర్చ్ కమిటీలను నియమించింది. ఆయా యూనివర్సిటీల వీసీ పోస్టుల కోసం వచ్చిన దరఖాస్తులను ఈ కమిటీలు పరిశీలించి ఒక్కో యూనివర్సిటీకి ముగ్గురి పేర్లను గవర్నర్‌కు సిఫారసు చేస్తాయి.

- Advertisement -

కాగా, 10వీసీ పోస్టులకు 312 మంది దరఖాస్తు చేసుకున్నారు. మార్చి 21తో వీసీల పదవీకాలం ముగియగా.. ప్రస్తుతం అన్ని యూనివర్సిటీలకు ఇన్‌ఛార్జ్ వీసీలుగా ఐఏఎస్‌లు వ్యవహరిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement