Tuesday, November 26, 2024

ఎయిర్ గన్ పేలి చిన్నారి మృతి కేసులో కొత్త ట్విస్ట్‌

ఎయిర్‌గన్ పేలి బాలిక మృతి కేసులో కొత్త విషయం వెలుగులోకి వచ్చింది. ఎయిర్‌గన్ పేలుడులో నిన్న నాలుగేళ్ల చిన్నారి మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే చిన్నారిని ఉద్దేశపూర్వకంగానే హత్య చేసినట్లు పోలీసులు నిర్ధారించారు.  ఉద్దేశపూర్వకంగానే దగ్గరి నుంచి కాల్చినట్టు గుర్తించారు.

మరోవైపు మృతిచెందిన చిన్నారి మృతదేహం ఇంకా ఉస్మానియా ఆసుపత్రి మార్చురీలోనే ఉంది. గురువారం ఆసుపత్రిలో మృతదేహనికి పోస్టుమార్టం నిర్వహించారు.

కాగా, సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం వావిలాల గ్రామంలోని ఓ ఫామ్‌ హౌజ్‌లో ఎయిర్ గన్ పేలిం శాన్వి అనే నాలుగు సంవత్సరాల పాప మృతిచెందిన విషయం తెలిసిందే. 

Advertisement

తాజా వార్తలు

Advertisement