హైదరాబాద్ – హైదరాబాద్ – తెలంగాణ నూతన ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి బాద్యతలు స్వీకరించనున్నారు.. ఢిల్లీలో కెసి వేణుగోపాల్ తెలంగాణ సిఎల్పీ నేతగా రేవంత్ రెడ్డిని ఎన్నుకున్నట్లు ప్రకటించారు.. ముఖ్యమంత్రి అభ్యర్థి ఎంపికకు సంబంధించి నిన్న సీఎల్పీ భేటీ జరిగిందని తెలిపారు. ఈ సందర్భంగా ఏకగ్రీవంగా రేవంత్ రెడ్డిని ఖరారు చేసినట్లు తెలిపారు. ఎల్లుండి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారన్నారు. సీనియర్లందరికీ ప్రాధాన్యత ఉంటుందన్నారు. అందరికీ న్యాయం జరుగుతుందని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ నేతలు అందరూ టీమ్ వర్క్ చేస్తారని చెప్పారు. సీఎల్పీ సమావేశంలో మూడు తీర్మానాలు చేసినట్లు వెల్లడించారు.
దీంతో పదేళ్ల విరామం తర్వాత తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడనుంది.. ఇక రేవంత్ రెడ్డి ఏడో తేదిన రేవంత్ ముఖ్యమంత్రిగా పదవీ స్వీకారం చేయనున్నారు.. కాగా, ఢిల్లీలో రోజంతా ఎడతెగని చర్చలు కొనసాగింది. ఈ నేపథ్యంలో టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ని అధిష్టానం తక్షణం ఢిల్లీకి రావాలసిందిగా ఆదేశించింది..
దీంతో హైదరాబాద్ లోని ఎల్లా హోటల్ లో గెలిచిన ఎమ్మెల్యేలతో పాటు ఉన్న రేవంత్ హస్తినకు పయనమవుతున్నారు.. కాగా నేటి ఉదయం పరిశీలకుడు డికె, తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ ఛార్జి మానిక్ రావు ఠాక్రేలు సిఎల్పీ సమావేశ వివరాలను ఖర్గే,రాహుల్, కెసి వేణుగోపాల్ లకు వివరించారు.. సిఎల్పీ నేత ఎంపికపై అదిష్టానం నేడంతా ఎడతెగని చర్చలు జరిపింది.. ఈ నేపథ్యంలోనే ఉత్తమ్ కుమార్ రెడ్డి, బట్టి విక్రమార్క్ లు రాహుల్ , ఖర్గే, కెసి వేణుగోపాల్, లతో చర్చలు జరిపారు.. దీని తర్వాతే రేవంత్ ను తక్షణం ఢిల్లీకి రావాలసిందిగా అధిష్టానం కోరింది.. ఇదే సమయంలో రేవంత్ రెడ్డి సిఎల్పీ నాయకుడిగా నియమించినట్లు కెసి వేణుగోపాల్ ప్రకటించారు.