నూతన జిల్లాలకు టీచర్ల బదిలీల ప్రక్రియ ఇక ముగిసినట్లే. ప్రస్తుతం జిల్లాలకు టీచర్ల కేటాయింపులు పూర్తి కావడంతో ఇక పాఠశాలలకు పోస్టింగులు ఇవ్వవలసి ఉంది. ఒక జిల్లా నుంచి వేరే జిల్లాలకు కేటాయించబడిన దాదాపు 22 వేల మంది టీచర్లు నేడో రేపో పోస్టింగ్ ఆర్డర్లు అందుకొని స్కూళ్లల్లో జాయిన్ కానున్నారు. ఇప్పటికే జిల్లాలకు కేటాయించిన ఉపాధ్యాయులకు జాయినింగ్ ఆర్డర్లు ఇవ్వాలని సీఎం నుంచి సంబంధిత శాఖ అధికారులకు ఆదేశాలు వెెళ్లడంతో పాఠశాల విద్యాశాఖ అధికారులు బదిలీ ప్రక్రియలో వేగం పెంచినట్లు తెలుస్తోంది.
ఇందులో భాగంగానే ఒకటి రెండ్రోజుల్లో ఈ ప్రక్రియనంతా ఫైనల్ చేసి ఈనెల 7వ తేదీలోపు టీచర్ల సర్దుబాటు ప్రక్రియను పూర్తి చేయాలను కుంటున్నారు. వారికి కేటాయించిన స్కూళ్లల్లో రిపోర్ట్ చేసేలా అధికారులు ఈమేరకు చర్యలు చేపడుతున్నారు. ఈనెల 8 నుంచి 16 తేదీ వరకు విద్యా సంస్థలకు సెలవులు ఉండడంతో ఇక కొత్తగా అలకేట్ అయిన ఉపాధ్యాయులు వారికి కేటాయించిన కొత్త స్కూళ్లకు సంక్రాంతి తర్వాతనే విధుల్లోకి చేరనున్నట్లు తెలుస్తోంది. పండగ తర్వాత స్కూళ్లల్లోని విద్యార్థులకు కొత్త ఉపాధ్యాయులు పాఠాలు బోధించనున్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital