Tuesday, November 26, 2024

మార్కెట్ లో కొత్త‌గా సీడ్ దందా..

బోధన్‌, (ప్రభన్యూస్‌) : తెలంగాణ ప్రభుత్వం వేసవికాలం రెండవ పంట వరి వేయవద్దని ధాన్యం కొనేది లేదని కేంద్ర ప్రభుత్వం ధాన్యం తీసుకోమని స్పష్టం చేస్తుండంతో వేసవికాలం రెండవ పంటగా ఏ పంటను సాగుచేయాలన్నది నిజామాబాద్‌, కామారెడ్డి జిల్లాల పరిధిలో రైతులకు అగమ్యగోచరంగా మారింది. వరి ధాన్యాన్ని కొనుగోలు చేసేది లేదని ప్రభుత్వం చెబుతున్న నేపథ్యంలో రైతులు పొద్దుతిరుగుడు పంట వేసేందుకు ఆసక్తి చూపెడుతుండగా, పొద్దుతిరుగుడు విత్తనాలు రైతులకు భారంగా మారాయి. ఈ పరిస్థితులలో మార్కెట్‌లో విత్తన వ్యాపారులు సీడ్‌ దందాకు తెర లేపారు. పొద్దుతిరుగుడు విత్తనాలకు తీవ్ర డిమాండ్‌ నెలకొనడంతో మార్కెట్‌లో కొరత ఏర్పడింది.

పొద్దుతిరుగుడు విత్తనాలు బహిరంగ మార్కెట్లో షేక్‌ మార్కెట్‌ను తలపిస్తున్నాయి. రెండు కిలోల పొద్దుతిరుగుడు విత్తనాల బస్తా నాలుగు వేల నుంచి ఐదు వేల రూపాయల వరకు ధర పలుకుతుంది. మార్కెట్‌లో దొంగ చాటుగా విత్తన వ్యాపారులు పొద్దుతిరుగుడు విత్తనాలను గుట్టుచప్పుడు కాకుండా విక్రయిస్తున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement