Friday, November 22, 2024

అంబేద్క‌ర్ సచివాల‌యం – అంబురాన్ని అంటే సంబురం..

రాష్ట్రవ్యాప్తంగా నిర్వహణకు చర్యలు
ముఖ్యఅతిథులుగా 4 రాష్ట్రాల సీఎంలు
పరేడ్‌ గ్రౌండ్‌లో బీఆర్‌ఎస్‌ బహిరంగ సభ

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ బ్యూరో: రాష్ట్రం ఎన్నికల మూడ్‌లోకి వెళ్ళిన వేళ అన్ని వర్గాల్లో జోష్‌ నింపేందుకు బీఆర్‌ఎస్‌ సర్కారు పకడ్బందీ వ్యూహంతో ముందుకు సాగుతోంది. ఈ నెల 17న ముఖ్యమంత్రి కేసీఆర్‌ పుట్టినరోజు కావడంతో… ఆ రోజు ఇటు రాష్ట్రంలో, అటు దేశంలో తెలంగాణలో కొత్తదనం సృష్టించి దేశం దృష్టిని మళ్ళించేం దుకు అన్ని ఏర్పాట్లు చేస్తోంది. ఖమ్మం సభ తరహాలోనే మరో నలుగురు జాతీయ స్థాయి ప్రముఖుల సమక్షంలో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కొత్త సచివాలయాన్ని ప్రారంభించడంతో పాటు, అదే రోజు సికింద్రాబాద్‌ పరేడ్‌ గ్రౌండ్‌లో బీఆర్‌ఎస్‌ భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అదే సమయంలో అధికార యంత్రాంగంలోనూ నూతనోత్సాహం నింపేందుకు కేసీఆర్‌ సీఎం కేసీఆర్‌ పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతున్నారు.


బహిరంగ సభ వేదికగా ఉద్యోగులకు శుభవార్త చెప్పేందుకు కూడా ప్రభుత్వం సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఒకేరోజు రెండు ప్రతిష్టాత్మక కార్యక్రమాలు ఉండడంతో ఇటు ప్రభుత్వ యంత్రాంగం, అటు పార్టీ కేడర్‌ అంతా సంసిద్ధం కావాలని మంత్రి కేటీ రామారావు ఆదేశాలు జారీ చేశారు. ఇందుకు సంబంధించి ముఖ్యమంత్రి మార్గదర్శకాల మేరకు గురువారం అసెంబ్లిd కమిటీ హాల్‌లో కేటీఆర్‌ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులతో సన్నాహక సమావేశం నిర్వహిం చారు. పక్కా ప్రణాళికతో సచివాలయ ప్రారంభోత్సవ ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి సూచించారు. తెలంగాణ వ్యాప్తంగా కొత్త సచివాలయ ప్రారంభోత్సవ వేడుకలు నిర్వహించేం దుకు జిల్లా, నియోజకవర్గస్థాయి నేతలకు దిశానిర్దేశం చేశారు.

తెలంగాణ కొత్త సచివాలయ ప్రారంభ వేడుకలు అన్ని నియోజక వర్గాల్లోనూ నిర్వహించాలని నిర్ణయించారు. దేశంలోనే ఎక్కడా లేని విధంగా సచివాలయానికి రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్‌ పేరు పెట్టినం దున ప్రతి నియోజక వర్గంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాలని మంత్రి కేటీ-ఆర్‌ పార్టీ నేతలను ఆదేశించారు. సచివాలయ ప్రారంభోత్సవ వేడుకలపై మంత్రి కేటీ-ఆర్‌ సన్నాహక సమావేశం నిర్వహించారు. గ్రేటర్‌ హైదరాబాద్‌, రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాల మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజాప్రతినిధులు ఈ సమావేశానికి హాజరయ్యారు. తెలంగాణ సాంస్కృతిక వైభవం కళ్లకు కట్టేలా సచివాలయాన్ని నిర్మించి.. అంబేద్కర్‌ పేరు పెట్టినందున ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని నిర్ణయించారు.

చండీయాగం, సుదర్శన యాగం

నూతన సచివాలయ భవనం ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముందు వాస్తుపూజ, చండీయాగం, సుదర్శనయాగం నిర్వహించనున్నారు. సచివాలయ ప్రారంభోత్సవం అనంతరం నిర్వహించనున్న సికింద్రా బాద్‌ పరేడ్‌ గ్రౌండ్‌ సభకు తమిళనాడు సీఎం స్టాలిన్‌, జార్ఖండ్‌ సీఎం హేమంత్‌ సోరెన్‌, బీహార్‌ డిప్యూటీ- సీఎం తేజస్వి యాదవ్‌, బీహార్‌ ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్‌ తరఫున ఆయన ప్రతినిధిగా జేడీయూ జాతీయ అధ్యక్షుడు లలన్‌సింగ్‌, బీఆర్‌ అంబేద్కర్‌ మనవడు ప్రకాష్‌ అంబేద్కర్‌, ఇతర రాష్ట్రాల నుంచి పలువురు ప్రముఖులు కూడా హాజరుకానున్నారు. దీంతో భారీ జన సమీకరణకు బీఆర్‌ఎస్‌ నేతలు ప్రణాళికలు రెడీ చేసుకున్నారు. సీఎం కేసీఆర్‌ 2019 జూన్‌లో కొత్త సచివాలయ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేసిన సంగతి తెలిసిందే.

కేసీఆర్‌ పుట్టిన రోజు రెండు ప్రత్యేకతలు
ఫిబ్రవరి 17 కేసీఆర్‌ పుట్టిన రోజు కూడా కావడంతో.. బీఆర్‌ఎస్‌ నేతలు ఆ రోజున మామూలుగానే భారీ ఎత్తున కార్యక్రమాలు నిర్వహించాలని ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు. ఎన్నికల ఏడాది కావడంతో ఎమ్మె ల్యేలు కూడా నియోజకవర్గ వ్యాప్తంగా కేసీఆర్‌ పుట్టిన రోజు వేడుకలు నిర్వహిస్తారు. ఇప్పుడు పుట్టినరోజుతో పాటు- రెండు ప్రత్యేక కార్యక్ర మాలు కూడా ఉన్నందున మరింత జోష్‌గా ఈ వేడుకలు నిర్వహించే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ప్రతిష్టను చాటేలా కొత్త సచివాలయం
తెలంగాణ రాష్ట్ర ప్రతిష్టను చాటేలా, 150-200 ఏండ్ల వరకు చెక్కు చెదరకుండా ఉండేలా సెక్రటేరియట్‌ను నిర్మించారు. 20 ఎకరాల సువిశా లమైన స్థలంలో రూ.617 కోట్లతో గ్రీన్‌ బిల్డింగ్‌ కాన్సెప్ట్‌ పద్ధతిలో సచి వాలయ నిర్మాణపనులు చేపట్టారు. భవనంలోకి సహజమైన గాలి, వెలుతురు వచ్చేలా డిజైన్‌ చేశారు. ఆరు అంతస్తుల్లో పాలనా విభాగాలు ఉండనున్నాయి. ఆరో అంతస్తులో సీఎం కార్యాలయంతోపాటు- మంత్రి వర్గ సమావేశ మందిరం, మరో పెద్ద హాల్‌ ఉంటాయి. ఇక బిల్డింగ్‌లోని రెండో అంతస్తు నుంచి మంత్రుల ఆఫీసులు ఉంటాయి. ఫస్ట్‌, సెకండ్‌ ప్లnోర్‌లో సాధారణ పరిపాలనా శాఖ, ఆర్థిక శాఖ కార్యాలయాలు ఉం టాయి. విశాలమైన స్థలంలో పార్కింగ్‌ ఏర్పాటు- చేశారు. ముఖ్యమంత్రి, మంత్రులు, అధికారులు, సిబ్బందికి వేర్వేరుగా పార్కింగ్‌ ఏర్పాటు- చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement