Saturday, November 23, 2024

New rule – ఎన్నికల సంఘం సంచలన నిర్ణయం … ఓటరు సహాయకుడికీ ఇంక్ గుర్తు

హైదరాబాద్ – తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. ఓటు వేసేందుకు వచ్చే సహాయకుల కుడి చేతి వేలిపై సిరా గుర్తును వేయాలని కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది. వికలాంగులు లేదా వృద్ధులను ఓటు వేసేందుకు తీసుకొచ్చే సహాయకుల కుడి చేతి చూపుడు వేలికి ఇంక్ గుర్తు పెట్టాలని నిర్ణయించారు. బూత్, ఓటు.. ఎన్నికల సంఘం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. సాధారణంగా ఓటరు ఎడమవైపు చూపుడు వేలుపై సిరా గుర్తు ఉంటుంది. ఓటర్ల సహాయకులుగా వచ్చిన వారి కుడిచేతి చూపుడు వేలిపై సిరా గుర్తు ఉంటుంది.

మరోవైపు మాక్ పోలింగ్ ఉదయం 5.30 గంటలకు ప్రారంభించాలని ఎన్నికల సంఘం సూచించింది. అయితే పోలింగ్‌ కేంద్రాల్లో సర్పంచ్‌లు, వార్డు సభ్యులు పోలింగ్‌ ఏజెంట్లుగా కూర్చునే అవకాశం ఎన్నికల కమిషన్‌ కల్పించింది. తెలంగాణ అసెంబ్లీకి ఈ నెల 30న పోలింగ్ జరగనుంది. ఈ ఏడాది డిసెంబర్ 3న ఓట్ల లెక్కింపు జరగనుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement