Tuesday, November 26, 2024

New Record – వర్షపాతంలో లక్ష్మీదేవిపేట కొత్త రికార్డ్ .. 64.9సెంటిమీటర్ల రెయిన్ ఫాల్

 హైదరాబాద్ – తెలంగాణ పదేళ్ల చరిత్రలో రికార్డు లెవల్ వానగా చెప్పుకోవచ్చు. రాష్ట్ర చరిత్రలో 2013 జులై 19న ములుగు జిల్లా వాజేడులో కురిసిన 51.75 సెం.మీ. వర్షమే అత్యధికంగా ఉండేది. గురువారం దీన్ని మూడో గరిష్ఠానికి చేరుస్తూ.. ములుగు జిల్లా వెంకటాపురం మండలం లక్ష్మీదేవిపేటలో 64.9 సెం.మీ. కురిసింది.

గురువారం కుండపోత వర్షానికి ఒకేసారి నాలుగు చోట్ల కొత్త రికార్డులు నమోదయ్యాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. భూపాలపల్లి జిల్లా చిట్యాలలో 61.8 సెం.మీ వర్షం పడింది. ఇది రాష్ట్ర చరిత్రలో రెండో అత్యధికంగా ఉందని చెప్పారు. కొత్తగా భూపాలపల్లి జిల్లా చెల్పూరు(47 సెం.మీ.), రేగొండ (46 సెం.మీ.) అయిదు, ఆరు గరిష్ఠ వర్షపాతాలుగా నిలిచాయని.. 2013 జులై 23న కుమురం భీమ్‌ జిల్లా దహేగాంలో కురిసిన 50.36 సెం.మీ 4వ అత్యధికంగా కొనసాగుతోందని వెల్లడించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement