Monday, November 11, 2024

CM Revanth : ఇది ఉద్యోగం కాదు.. భావోద్వేగం..

  • ఒక్కో చిక్కుముడి విప్పుతున్నాం
  • పది నెలల్లో 50వేల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ
  • బాధ్యతలు చేపట్టిన ఎల్బీ స్టేడియంలోనే నియమాక పత్రాలు
  • నిరుద్యోగుల కండ్లల్లో ఆనందం చూశాం
  • నిరుద్యోగులు, విద్యార్థులతో మాట్లాడండి
  • చదువుకుంటేనే గుర్తింపు వస్తుందని చెప్పండి
  • ప్రభుత్వంపై విశ్వాసం, భరోసా కల్పించండి
  • కాలుష్యం నుంచి హైదరాబాద్​ సిటీనికి కాపాడుకుందాం
  • త్వరలోనే ఎలక్ట్రిక్​ వాహనాల పాలసీ తీసుకొస్తాం
  • ఇప్పటి వరకూ బడి దొంగల్ని చూశాం
  • అప్పోజిషన్ లీడర్ అసెంబ్లీకి రాకపోవటం విచిత్రం
  • మీరు రాకుంటే తెలంగాణ జనం మర్చిపోతారు
  • ఖైరతాబాద్​లో ఏఎంవీఐలకు నియామక పత్రాల అందజేత
  • ఉద్వేగంగా ప్రసంగించిన సీఎం రేవంత్​రెడ్డి

ఆంధ్రప్రభ స్మార్ట్, హైదరాబాద్ : ఇది ఉద్యోగం కాదు.. భావోద్వేగం.. తెలంగాణ ఆకాంక్షలను నెరవేరుస్తున్నాం.. అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కో చిక్కుముడిని విప్పుకుంటూ ముందుకుపోతున్నాం.. ఈ పది నెలల కాలంలో 50వేల ప్రభుత్వ ఉద్యోగులు ఇచ్చాం. ఎక్కడైతే అధికార బాధ్యతలు చేపట్టామో అక్కడే ఉద్యోగులకు నియామక పత్రాలు అందించాం. ఎల్బీ నగర్​ స్టేడియంలో జరిగిన కార్యక్రమంలో ఉద్యోగులు, వారి కుటుంబం కండ్లల్లో ఆనందం చూశాం.. ఇప్పటికైనా మీరు మీ గ్రామంలో నిరుద్యోగులకు, విద్యార్థులకు చెప్పండి.. చదువుకుంటేనే మేలు జరుగుతుంది.. ప్రభుత్వం భరోసా ఉంటుందని స్పష్టంగా చెప్పండి అని సీఎం రేవంత్​ అన్నారు.

ఇప్పటి వరకూ బడి దొంగలను చూసాం.. కానీ, ఓ ప్రతిపక్ష నాయకుడు అసెంబ్లీకి రాని విచిత్ర పరిస్థితిని తెలంగాణలోనే చూస్తున్నాం.. మీరు లేకపోయినా ఏం బాధలేదు.. మీతో ప్రజలకేం పని లేదు.. తెలంగాణ సమాజం నిన్ను మరిచిపోయింది.. అని మాజీ సీఎం కేసీఆర్‌ను సీఎం రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు. ఖైరతాబాద్‌లోని ఆర్టీఏ కార్యాలయంలో అసిస్టెంట్ మెటార్ వెహికల్ ఇన్‌స్పెక్ట‌ర్‌ పోస్టులకు ఎంపికైన ఉద్యోగులకు సోమవారం సీఎం రేవంత్ అపాయింట్ మెంట్ లెటర్లను అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఈ పది నెలల్లో నిరుద్యోగులు ఉద్యోగాలు పొందారు, రైతులు రైతు రుణమాఫీతో రుణ విముక్తులయ్యారు. కానీ, మీ ఇంట్లో నలుగురు ఉద్యోగాలు కోల్పోయారు.. తప్ప తెలంగాణ ప్రజలు కోల్పోయిందేం లేదని విమ‌ర్శ‌లు గుప్పించారు.

పది నెలల్లో ఎన్నో చేశాం..

- Advertisement -

పది నెలల్లో ఏం కోల్పోయారో ప్రజలకు అర్ధమైందని ఒకాయన మాట్లాడుతుండు అని సీఎం రేవంత్ అన్నారు. పది నెలల్లో రైతులు, నిరుద్యోగులను ఆదుకున్నాం, విద్యార్థులకు నాణ్యమైన విద్య అందిస్తున్నాం.. కేసీఆర్ వాస్తు కోసం సచివాలయం, ప్రగతి భవన్ కట్టుకుండు కానీ.. రెసిడెన్షియల్ స్కూల్స్ నిర్మించలేదని ఎద్దేవ చేశారు. మా ప్రభుత్వం రాగానే 100 నియోజవర్గాల్లో యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్స్ నిర్మాణానికి శ్రీకారం చుట్టాం.. 21వేల మంది టీచర్లు పదోన్నతులు పొందగలిగారు.. 35వేల మంది టీచర్ల బదిలీలు చేసిన ఘనత ఈ ప్రజా ప్రభుత్వానిది అన్నారు.

లోపాలుంటే చెప్పండి.. సలహాలివ్వండి..

విద్యతోనే తెలంగాణ సమాజాన్ని నిర్మిస్తుందని నిరూపిస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి వివరించారు. ఎన్ని అడ్డంకులు సృష్టించినా 563 గ్రూప్ ఉద్యోగాలకు విజయవంతంగా పరీక్షలు నిర్వహించాం. త్వరలో నియామకపత్రాలు అందించి.. తెలంగాణ పునర్నిర్మాణంలో వారిని భాగస్వాములను చేస్తాం అని ధీమా వ్యక్తం చేశారు. కోటి 5 లక్షల మంది మహిళలు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణంతో లబ్ది పొందారు. నష్టాల్లో కూరుకున్న ఆర్టీసీ లాభాల బాటలో పయనిస్తోంది, 49. 90 లక్షల కుటుంబాలు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ వినియోగించుకుంటున్నారు. ₹500లకే మా ఆడబిడ్డలు వంటగ్యాస్ సిలిండర్ అందుకోగలుగుతున్నారు. రాజీవ్ ఆరోగ్యశ్రీ లో ₹ 10 లక్షల వరకు ఉచిత వైద్యం అందుకోగలుగుతున్నారు. తెలంగాణ పునర్నిర్మాణంలో ఇవన్నీ చేసాం అని సీఎం వివరించారు. ఇప్పటికైనా మీలో మార్పు రావాలి.. ప్రభుత్వం చేసే మంచి పనులకు మద్దతు ఇవ్వండి.. లోపాలు ఉంటే సలహాలు ఇవ్వండి. అని ఉద్యమ నేత, తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ కు సీఎం రేవంత్​ సూచించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement