Thursday, November 21, 2024

TS: సబ్​ రిజిస్ట్రార్​ ఆఫీసులకు కొత్త లుక్​.. సీఎం రేవంత్

కార్పొరేట్ తరహాలో నిర్మాణం
అధునాతనమైన భవనాలు
పరిసరాలు ఆహ్లాదంగా ఉండేలా తీర్చిదిద్దాలి
మోడల్​గా ఉండాలని సీఎం రేవంత్​ నిర్ణయం

రిజిస్ట్రేషన్లకు వచ్చే వాళ్లు కూర్చోడానికి కుర్చీలు లేకుండా.. చెట్ల కింద, నీడ దొరికిన చోట నిరీక్షించే పరిస్థితి ఇకపై ఉండకూడదని సీఎం రేవంత్ రెడ్డి అధికారులతో అన్నారు. రాష్ట్రంలోని అన్ని సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులను మోడల్ రిజిస్ట్రేషన్ ఆఫీసులుగా తీర్చిదిద్దాలని ఆదేశించారు. సోమవారం అధికారులతో జరిగిన సమీక్షలో ఈ విషయాన్ని వెల్లడించారు. రాష్ట్రంలో మొత్తం 144 సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులున్నాయి. వీటిలో 38 ఆఫీసులు మాత్రమే సొంత భవనాల్లో ఉన్నాయి. ఆదిలాబాద్ లో బోథ్, మేడ్చల్ జిల్లా షామీర్​ పేట సబ్​ రిజిస్ట్రార్ ఆఫీసులు ఎన్నికల కోడ్ తర్వాత ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయి.

అద్దె భవనాల్లో 104 ఆఫీసులు..
ఇక.. మిగతా 104 ఆఫీసులు అద్దె భవనాల్లోనే కొనసాగుతున్నాయి. 52చోట్ల ఆఫీసులకు అవసరమయ్యే భవనాల నిర్మాణానికి ప్రభుత్వ భూమి కూడా కేటాయించారు. భూములు రెడీగా ఉన్న చోట వీలైనంత త్వరగా మోడల్ రిజిస్ట్రేషన్ ఆఫీసులను నిర్మించాలని సీఎం నిర్ణయం తీసుకున్నారు. మిగతా 52 సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులకు సరిపడే స్థలాలను అన్వేషించాలని, పబ్లిక్ యుటిలిటీ కింద సేకరించిన స్థలాలు అందుబాటులో ఉంటే.. అక్కడే నిర్మాణాలు చేపట్టాలని సూచించారు. కాగా, మొదటి దశలో ఆదాయం ఎక్కువగా తెచ్చిపెడుతున్న రంగారెడ్డి, మేడ్చల్, హైదరాబాద్, సంగారెడ్డి జిల్లాల పరిధిలోని సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల నిర్మాణాలకు ప్రాధాన్యమివ్వాలని నిర్ణయించారు.

పరిసరాలు ఆహ్లాదంగా ఉండేలా..
సబ్​ రిజిస్ట్రార్​ ఆఫీసులకు వచ్చే క్రయ విక్రయదారులు తమ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ముగిసేంత సేపు మంచి ఆతిథ్యమిచ్చే, ఆహ్లదంగా ఉండే కార్పొరేట్ లుక్, వెయిటింగ్ హాల్, డ్రింకింగ్ వాటర్, కెఫేటెరియా లాంటి అన్ని సదుపాయాలుండాలని, అవన్నీ ఉండేలా అధునాతన నిర్మాణాలు చేపట్టాలని సీఎం సూచించారు. ఎక్కువ రిజిస్ట్రేషన్లు జరిగే చోట సిబ్బంది కొరత లేకుండా చూడాలని సీఎం అధికారులను ఆదేశించారు. ఆదాయం తక్కువగా ఉన్న జిల్లాల ఆఫీసుల నుంచి ఎక్కువ పని ఉన్న చోటికి సిబ్బందిని సర్దుబాటు చేయాలని ఆదేశించారు.

- Advertisement -

టీజీ లోగో పై రుద్ర రాజేష్ తో రేవంత్ చ‌ర్చ‌లు …
తెలంగాణ రాష్ట్ర అధికారిక చిహ్నంపై చిత్రకారులు రుద్ర రాజేశంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చర్చించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ పలు నమూనాలను పరిశీలించారు. తుది నమూనాపై సీఎం పలు సూచనలు చేశారు. ఇప్పటికే తెలంగాణ కోడ్ టీఎస్ స్థానంలో టీజీని తీసుకొచ్చారు. టీఎస్ స్థానంలో టీజీని అమలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలో, అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థలు, ఏజెన్సీలు, స్వయం ప్రతిపత్తి సంస్థలు, కార్పొరేషన్లు, వెబ్‌సైట్‌లు, ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్‌లు, ఇతర అధికారిక కమ్యూనికేషన్‌లు కూడా టీఎస్‌కు బదులుగా తెలంగాణ కోడ్‌ను టీజీగా ఉపయోగిస్తున్నాయి. లెటర్‌హెడ్‌ల నివేదికలు, నోటిఫికేషన్‌లు, అధికారిక వెబ్‌సైట్‌లు, ఆన్‌లైన్ బయోస్, ఇతర అధికారిక వెబ్‌సైట్‌లు ఆన్‌లైన్ బయోస్‌లో టీజీ గా మార్చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement