విజయ బ్రాండ్ కొత్త ఉత్పత్తులను ప్రారంభించనుంది. విజయ డెయిరీ, అటు ఆయిల్ ఫెడ్ సంస్థలు వంటకు అవసరమయ్యే అన్ని సరుకులను విజయ బ్రాండ్ పేరుతో అందుబాటులోకి తెస్తున్నాయి. ఇప్పటికే విజయ బ్రాండ్ పేరుతో పాలు, పాల ఉత్పత్తులు, వంట నూనెలను సరఫరా చేస్తున్నది. వీటికితోడు ఇప్పుడు ఆయిల్ ఫెడ్ ఆధ్వర్యంలో మరో 22 రకాల కొత్త ఉత్పత్తులు అందుబాటులోకి వస్తున్నాయి. ఇందుకోసం హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లో రూ.15 కోట్లతో ప్రాసెసింగ్ యూనిట్ సిద్ధమైంది. దీన్ని సోమవారం లాంఛనంగా ప్రారంభించి ఉత్పత్తులను మార్కెట్లోకి విడుదల చేయనున్నారు. బియ్యం, బాస్మతి బియ్యం, పప్పులు, మినుపగుళ్లు, జొన్నపిండి, గోధుమ పిండి, రాగి పిండి, మసాలా టీ పొడి, అయోడైజ్డ్ ఉప్పు, కల్లు ఉప్పు, పల్లీలు, బాదంపప్పు, జీడిపప్పుడు, కిస్మిస్, ఆక్రూట్, అంజీరా, బిర్యానీ మసాలాలు, యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్క, తాలింపు దినుసులు, మిరియాలు సహా 22 కొత్త ఉత్పత్తులను ఆయిల్ ఫెడ్ తీసుకురానున్నది. నాణ్యతకు, నమ్మకానికి పెట్టింది పేరైన విజయ బ్రాండ్ పేరుతో సరసరమైన ధరల్లో అందించేందుకు ఆయిల్ ఫెడ్ ప్రయత్నిస్తున్నది.
Advertisement
తాజా వార్తలు
Advertisement