Friday, November 22, 2024

Rajendra Nagarలో హైకోర్టు – జనవరిలో కొత్త భవన నిర్మాణానికి శంకుస్థాపన…

హైదరాబాద్‌: ప్రస్తుత హైకోర్టు శిథిలావస్థకు చేరుకున్నందున రాజేంద్రనగర్‌లో 100 ఎకరాల్లో హైకోర్టు నూతన భవనం శంకుస్థాపనకు ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు.హైదరాబాద్‌లోని మర్రిచెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థలో సీఎం రేవంత్‌రెడ్డి, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ అలోక్‌ అరాధే సమావేశమయ్యారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, న్యాయశాఖ కార్యదర్శి తిరుపతి, సీఎం ప్రిన్సిపల్‌ సెక్రటరీ శేషాద్రి, హైదరాబాద్‌, రంగారెడ్డి జిల్లాల కలెక్టర్లు, ఐఏఎస్‌ అధికారి నవీన్‌ మిత్తల్‌తో పాటు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు

రాష్ట్రంలోని న్యాయస్థానాల స్థితిగతులు, వసతులు తదితర అంశాలపై ఈ సమావేశంలో చర్చించారు. ప్రధానంగా ఇప్పుడున్న హైకోర్టు శిథిలావస్థకు చేరుకుందని హైకోర్టు సీజే.. సీఎం దృష్టికి తీసుకొచ్చారు. దీనిపై వెంటనే స్పందించిన సీఎం.. ఎక్కడ వంద ఎకరాలకంటే ఎక్కువ ప్రభుత్వ స్థలం ఉందో అధికారులను అడిగి వివరాలు తీసుకున్నారు. రాజేంద్రనగర్‌ ప్రాంతంలో ఉందని అధికారులు తెలియజేయడంతో.. అక్కడ భవనాలు నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. జనవరిలో శంకుస్థాపన చేసేందుకు వీలుగా ఏర్పాట్లు చేయాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు

Advertisement

తాజా వార్తలు

Advertisement