Friday, November 22, 2024

బిఆర్ఎస్ లో కొత్త‌వారికి ఎమ్మెల్సీ ప‌ద‌వులు?

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ ప్రధాన ప్రతినిధి: నిజామా బాద్‌ జిల్లాలో ఖాళీ అవుతున్న రెండు ఎమ్మెల్సీ స్థానాల భర్తీకి భారాస అధినేత ముఖ్యమంత్రి కేసీఆర్‌ భారీ కసరత్తు చేస్తున్నట్టు- పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఈ ఎన్నికపై ఆయన ప్రత్యేక దృష్టి సారించారన్న వార్తలు వెలువడుతున్నాయి. ఎన్నికల ఏడాది కావడంతో ఎమ్మెల్సీ అభ్యర్థుల విషయంలో గులాబీ దళపతి ఆచితూచి అడు గులు వేస్తున్నారు. జిల్లా నుంచి ఎమ్మెల్సీలుగా రాజేశ్వర్‌ రావు, గంగాధర్‌ గౌడ్‌లు కొనసాగుతుండగా వీరిలో గంగా ధర్‌ పదవీ కాలం మార్చి నెల చివరిన, రాజేశ్వర్‌ రావుది ఏప్రిల్‌ చివరిన పూర్తవుతుంది. గతంలో వీరిద్దరి పదవీ కాలం రెండో దఫా పొడిగించినా ఈసారి ఆ అవకాశం లేనట్టు- సమాచారం. ఖాళీ అవుతున్న రెండు స్థానాల్లో కేసీఆర్‌ ఎవరికి అవకాశం ఇవ్వబోతున్నారు? ఈ జిల్లా వారికే ఈ పదవులు వరిస్తాయా? లేక వివిధ సందర్భాల్లో కేసీఆర్‌ ఇచ్చిన హామీ మేరకు ఇతర జిల్లాలకు ఈ పదవులు బదలా యిస్తారా అనే అంశంపై సస్పెన్స్‌ నెలకొంది.

రెండు ఎమ్మెల్సీ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్‌ను ఇప్పటికే ప్రకటించింది. దీంతో ఎమ్మెల్సీ ఎన్నికల వేడి మొదలైంది. ఏ జిల్లాలో ఎంతమంది సిట్టింగ్‌ ఎమ్మెల్సీలు ఉన్నారు. ప్రస్తుతం ఎమ్మెల్సీ రేసులో ఎవ ంవరున్నారన్న లెక్కలను తీసే పనిలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఉన్నట్టు- తెలుస్తోంది. ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాలో ప్రస్తుతం ముగ్గురు ఎమ్మెల్సీలు ఉండగా ఇందులో స్థానిక సంస్థల కోటాలో కల్వకుంట్ల కవిత, గవర్నర్‌ కోటాలో రాజేశ్వర్‌ రావు, ఎమ్మెల్యే కోటాలో గంగాధర్‌ గౌడ్‌ ఎమ్మె ల్సీలుగా ఉన్నారు. కవిత మినహా రాజేశ్వర్‌ రావు, గంగాధర్‌ గౌడ్‌ల పదవీ కాలం ముగియనుంది. ఎమ్మెల్సీలుగా ఎన్ని కయ్యే ముందు రాజేశ్వర్‌ రావు కాంగ్రెస్‌ నుంచి రాగా గంగా ధర్‌ తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చి గులాబీ కండువా కప్పు కున్నారు. ఎమ్మెల్సీ హోదాలో పార్టీలో చేరిన వారికి ముం దుగా ఇచ్చిన హామీ మేరకు ఈ ఇద్దరికి సీఎం కేసీఆర్‌ రెండో సారి తమ పదవీ కాలాన్ని పొడిగించారు. ఇప్పటికే రెండు దఫాలు ఎమ్మెల్సీ పదవులను అనుభవించిన ఈ ఇద్దరు నేతలకు మరోసారి అవకాశం దక్కడం అనుమానమేనన్న చర్చ జరుగుతోంది. ఎమ్మెల్సీ పదవులను ఇస్తానని రాష్ట్రం లో ఆయా జిల్లాలలో కీలకంగా పనిచేస్తున్న నేతలకు కేసీఆర్‌ ఇప్పటికే హామీ ఇచ్చారు. ఆ కోటాలో దాదాపు 20మందికి పైగా ఉన్నట్టు- సమాచారం. ఎన్నికల సంవత్సరం కావడం తో పార్టీ బలహీనంగా ఉన్న జిల్లాలు, అసెంబ్లీ, పార్లమెంట్‌ నియోజకవర్గాలను గుర్తించి అక్కడ పార్టీని బలోపేతం చేసేందుకు అవసరమైన నాయకులను ఎంపిక చేసి వారికి ఎమ్మెల్సీ పదవులను ఇవ్వవచ్చన్న ప్రచారం పార్టీలో జోరుగా సాగుతోంది.

ఇప్పుడు మరోసారి తమ పదవీ కాలం పొడిగిస్తారన్న ఆశలో ఉన్నట్టు- సమాచారం. అయితే కొత్తవారికి ఈ రెండు పదవులను కట్టబెట్టాలన్న యోచనలో గులాబీ బాస్‌ కేసీఆర్‌ ఉన్నట్టు- సమాచారం. సామజిక బలాలను నమ్ముకున్న వీరిద్దరు తమ పదవీ కాలం పొడిగిస్తారని ఉవ్విళూరు తున్న ట్టు- సమాచారం. గౌడ్‌ సామజిక వర్గానికి చెందిన ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాకు చెందిన సీనియర్‌ నేత మాజీ మంత్రి రాజేశం గౌడ్‌, గంగాధర్‌ గౌడ్‌ స్థానంలో ఎమ్మెల్సీ పదవిని ఆశిస్తుండగా ఇదే సామాజిక వర్గానికి చెందిన మరి కొంత మంది తమ ప్రయత్నాలను ముమ్మరం చేశారని సమాచా రం. ఒకవేళ గంగాధర్‌ గౌడ్‌కు మరో పదవి ఇవ్వాలనుకుంటే మూడోసారి అధికారంలోకి వస్తే కార్పొరేషన్‌ చైర్మన్‌ పదవి ఇస్తానన్న హామీ కేసీఆర్‌ ప్రకటించే అవకాశం ఉంది.
దళిత క్రిస్టియన్‌ సామాజిక వర్గానికి చెందిన రాజేశ్వర్‌ రావుకు పార్టీ పదవి ఇస్తారన్న సంకేతాలు వెలువడు తున్నాయి. ఈ ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో అసంతృప్తులను బుజ్జగించేందుకు సీఎం ఎమ్మెల్సీ పదవులను వాడుకునే సూచనలున్నాయి. అందుకే ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాకు చెందిన రెండు ఎమ్మెల్సీ పదవులను ఎవరికి కేటాయిస్తారన్న విషయం గులాబీ పార్టీలో ఆసక్తి రేపుతోంది. కాంగ్రెస్‌ నుంచి భారాసలో ఎమ్మెల్సీ హోదాలో చేరిన నిజామాబాద్‌ గ్రామీణ ప్రాంత మహిళా నేత ఆకుల లలిత పదవీ కాలాన్ని పొడిగించలేదు. ఎమ్మెల్సీ పదవీ కాలం ముగిసిన తర్వాత ఆమెకు ఏ పదవీ ఇవ్వలేదు. స్థానిక సంస్థల కోటాలో ఎమ్మెల్సీగా కవితను ఎంపిక చేశారు. అయితే ఆయా పార్టీలలో ఎమ్మెల్సీగా ఉండి భారాసలో చేరిన వారందరి పదవీ కాలాన్ని రెండో దఫా పొడిగించినా ఆకుల లలితకు అవకాశం దక్కలేదు. ఆ తర్వాత లలితను రాష్ట్ర మహిళా ఆర్థిక కార్పొరేషన్‌ చైర్మన్‌గా కేసీఆర్‌ నియమించారు. అయితే ఓ చిన్న జిల్లాకు మూడు ఎమ్మెల్సీ పదవులెందుకన్న ప్రశ్న తాజాగా తెరపైకి వస్తోంది. రాజకీయ సమీకరణాల నేపథ్యంలో రెండు ఎమ్మెల్సీ పదవులను ఇతర జిల్లాల వారితో భర్తీ చేసే అవకాశం ఉందని భారాసలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఆశావహులు మాత్రం కేసీఆర్‌ ఆశీర్వాదంపై భారీగా ఆశలు పెట్టు-కున్నారు. ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాలో చాలా మంది సీనియర్లు ఎమ్మెల్సీ పదవుల కోసం ఎదురుచూస్తున్నారు.
అందు లోనూ ఎన్నికల ఏడాది కావడంతో అధిష్టానం ఖచ్చితంగా సామాజిక సమతుల్యం పాటించే అవకాశం ఉందని చెబుతున్నారు. మాజీ ఎమ్మెల్సీ అరిగెల నర్సారెడ్డి, జిల్లా మాజీ అధ్యక్షుడు ఈగ గంగారెడ్డి, కామారెడ్డి జిల్లా భారాస అధ్యక్షుడు ముజిబుద్దీన్‌ రేసులో ఉన్నారు. కాగా మాజీ మంత్రి, ఖమ్మం జిల్లాకు చెందిన తుమ్మల నాగేశ్వర రావుకు ఈ దఫా ఎమ్మెల్సీ ఖాయమన్న ప్రచారం ఉంది. ఇటీ-వల ఖమ్మం జిల్లా కేంద్రంలో నిర్వహించిన భారాస తొలి బహిరంగ సభ ఏర్పాట్లకు వెళ్లిన మంత్రి హరీష్‌రావు తుమ్మల ఆహ్వానం మేరకు ఆయన నివాసానికి విందుకు వెళ్లారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ హామీ ఇచ్చినట్టు- బాగా ప్రచారం జరిగింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement