1948 లో జాగీర్ధార్ జమీందారీ, భూస్వామ్య విధానానికి వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో నిజాం రాక్షస తుపాకీ గుండ్లకు బలయిన అమరవీరులకు న్యూడేమెక్రసీ బయ్యారం సబ్ కమిటీ ఆధ్వర్యంలో నివాళులు అర్పించారు. అమరవీరుల వారోత్సవాలలో బాగంగా బండ్లకుంటలో సంస్మరణ సభ జరిగింది. ఈ సభలో సబ్ డివిజన్ కార్యదర్శి నందగిరి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ తెలంగాణ సాయుధ పోరాటంలో బండ్లకుంటకు వీరోచిత చరిత్ర వుందని అన్నారు. నైజాం నిరంకుశ సైన్యంతో జరిగిన పోరులో దామినేని వెంకటేశ్వరావు,కంచర్ల బుచ్చిమల్లు,బీరవెల్లి లక్ష్మయ్య, ఐలబోయిన ఎర్రయ్య,పోడుగు లచ్చినర్సు, కుంజ ముత్తిలింగం,కారంగాదయ్య, ఏపే బాలయ్య, కుంజ జోగయ్య మోకాళ్ళ ఎ ర్రయ్య,మాడే బుచ్చిమల్లు,భూక్యా సక్రాం,వేములపల్లి కృష్ణ, తాటి మల్లయ్య,తాటి లక్ష్మయ్య,తాటి బాలరాజు,లు వీరమరణం పొందారని తెలిపారు.ఆ అమరుల పోరాట స్పూర్తి తో నేడుకేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను ప్రతిఘటించడానికి సమరశీల పోరాటాలు నిర్వహించాలని కోరారు. ఈ కార్యక్రమంలో రామ చంద్రుల మురళి,రాజు, గోగుల సాయి,తాటి వీరన్న, కోటయ్య, లింగాలరాములు, భూక్యా నందా, తదితరులు పాల్గొన్నారు.