హైదరాబాద్, (ప్రభ న్యూస్): ఈ విద్యా సంవత్సరం నుంచి ప్రవేశపెట్టిన నూతన కోర్సులైనటువంటి బీఏ హానర్స్ ఎకనామిక్స్, పొలిటికల్ సైన్స్ పూర్తి చేసేవారికి ఉద్యోగవకాశాలు మెండుగా ఉంటాయని తెలంగాణ ఉన్నత విద్యామండలి ఛైర్మన్ ప్రొ.ఆర్.లింబాద్రి తెలిపారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలనే ఉద్ధేశ్యంతో ఉన్నత విద్యామండలి ప్రత్యేకమైన బీఏ హానర్స్ కోర్సులను డిగ్రీ విద్యార్థుల కోసం అందుబాటులోకి తీసుకొచ్చిందన్నారు. బీఏ హానర్స్ కోర్సుపై గురువారం మాసాబ్ ట్యాంక్‌లోని కార్యాలయంలో మీడియా సమావేశాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా లింబాద్రి మాట్లాడుతూ పొలిటికల్ సైన్స్, ఎకనామిక్స్ కోర్సుల్లో చేరేవారికి థీయరీ క్లాసులతో పాటు ప్రత్యేక ఫీల్డ్ ప్రాజెక్టు వర్క్‌ను ఇవ్వనున్నట్లు తెలిపారు. రాజకీయ నాయకులతో, వ్యాపారవేత్తలతో, అర్థిక నిపుణులతో ప్రత్యేక తరగతులను కూడా బోధించేలా ప్రణాళికలు రచిస్తున్నట్లు తెలిపారు. పైలట్ ప్రాజెక్టు కింద ముం దస్తుగా కోటి ఉమెన్స్ కాలేజీ, నిజాం కాలేజీ, సిటీ కాలేజీ, బేగంపేట్ ప్రభుత్వ డిగ్రీ ఉమెన్స్ కాలేజీలో బీఏ హానర్స్ కోర్సును ఇప్పటికే ప్రవేశ పెట్టినట్లు వెల్లడిం చారు.
అయితే పొలిటికల్ సైన్స్ కోర్సును కోటి ఉమెన్స్ కాలేజీలో, ఎకనామిక్స్ కోర్సును నిజాం కాలేజీలో అందుబాటులో ఉన్నట్లు తెలిపారు. అలాగే సిటీ కాలేజీ, బేగంపేట్ డిగ్రీ ఉమెన్స్ కాలేజీల్లో మాత్రం బీఏ హానర్స్ (పొలిటికల్ సైన్స్), (ఎకనామిక్స్) రెండూ కోర్సుల చొప్పున ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా ఉన్నత విద్యామండలి ఛైర్మన్ ప్రొ.లింబాద్రి, వైస్ ఛైర్మన్ ప్రొ.వి.వెంకటరమణ, ఓయూ వీసీ రవిందర్, సెస్ డైరెక్టర్ ఇ.రేవతి పాల్గొన్నారు.
లోకల్ టు గ్లోబల్..రియల్ టైమ్ న్యూస్ అప్ డేట్స్ కోసం..ప్రభన్యూస్ ఫేస్‌బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
https://twitter.com/AndhraPrabhaApp, https://www.facebook.com/andhraprabhanewsdaily