హైదరాబాద్ – కులగణన సర్వేకు రేషన్ కార్డులకు ఎందుకు ముడిపెట్టారని ప్రశ్నించారు. ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్న వారికి రేషన్ కార్డులు ఇవ్వరా అని నిలదీశారు. కుల గణన సర్వేను బేస్ చేసుకొని, ఆ లిస్టును మాత్రమే ప్రింట్ తీసి గ్రామాలకు పంపించారని అన్నారు.
ఆన్ లైన్‌లో మీ సేవలో కొన్ని లక్షల మంది దరఖాస్తులు చేసుకున్నారని గుర్తుచేశారు. ప్రజా పాలన సమయంలోనూ దరఖాస్తులు చేశారని తెలిపారు. ఆ దరఖాస్తులు అన్నింటినీ చెత్తబుట్టలో వేశారని అన్నారు. ప్రజాపాలనలో 11లక్షల దరఖాస్తులు వస్తే ఎందుకు పరిశీలించడం లేదని ప్రశ్నించారు.
మీ సేవ ద్వారా దరఖాస్తు చేసుకున్న దరఖాస్తులను ఎందుకు పరిశీలించడం లేదని నిలదీశారు. కుల గణన సర్వే చేసేటప్పుడు ఇది ఆప్షనల్ మాత్రమే.. బలవంతం లేదని.. ఇష్టం ఉన్న వారు మాత్రమే పాల్గొనవచ్చని చెప్పారు కదా అని ప్రశ్నించారు. ఇప్పుడు మాత్రం దాన్ని బేస్ చేసుకొని అర్హులకు రేషన్ కార్డులు రాకుండా కోతలు పెడుతున్నరని మండిపడ్డారు.
వాయిదా వేసుకుని అయినా సరే అర్హులందరికీ రేషన్ కార్డులు ఇచ్చేవిధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేదంటే గ్రామగ్రామన నిరసనలు తప్పవని హెచ్చరించారు. అర్హులందరికీ రేషన్ కార్డులు ఇవ్వకపోతే ఎక్కడికక్కడ నిలదీయాలని పిలుపునిచ్చారు. అర్హులకు రేషన్ కార్డులు వచ్చే దాకా బీఆర్ఎస్ పోరాటం చేస్తుందని స్పష్టం చేశారు.