ఇదే మా పోలీసింగ్ విధానం
సిటీ సీపీగా సీవీ ఆనంద్ బాధ్యతల స్వీకరణ
ఫ్రెండ్లీ పోలిసింగ్ అనేది డిపార్ట్‌మెంట్‌లో ఒక భాగం
డ్రగ్స్, గంజాయి నిర్మూలనకు కృషి చేస్తున్నాం
లా అండ్ ఆర్డర్ మరింత మెరుగుపరుస్తాం
రెండోసారి సిటీ కమిషనర్‌గా పనిచేయడం సంతోషంగా ఉంది
మీడియాతో కొత్త సీపీ ఆనంద్ చిట్‌చాట్
హైదరాబాద్ 61వ పోలీస్ కమిషనర్‌గా సీనియర్ ఐపీఎస్ అధికారి సీవీ ఆనంద్ బాధ్యతలు స్వీకరించారు. సోమవారం ఉదయం సీపీ ఆఫీసులో ప్రస్తుత సీపీ శ్రీనివాస్ రెడ్డి నుంచి ఆయన చార్జ్ తీసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. హైదరాబాద్ సీపీగా రెండోసారి బాధ్యలు చేపట్టడం సంతోషంగా ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం డ్రగ్స్‌పై సీరియస్‌గా ఉందన్నారు. డ్రగ్స్, గంజాయి నిర్మూలనకు కృషి చేస్తానని తెలిపారు. నగరంలో లా అండ్ ఆర్డర్‌ను మరింత మెరుగుపరుస్తామని చెప్పారు. ఫ్రెండ్లీ పోలీసింగ్ అనేది పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో ఒక భాగమని వెల్లడించారు. ప్రజలతో ఫ్రెండ్లీ పోలీసింగ్ ఉంటుందని.. క్రిమినల్స్‌పై ఉక్కుపాదం మోపుతామన్నారు.
వినియక నిమజ్జనం కీలకం..
హైదరాబాద్ సిటీలో వినాయక నిమజ్జనం చాలా కీలకమైన అంశం అని సీవీ ఆనంద్ చెప్పారు. నిమజ్జన ఘట్టం ప్రశాంతంగా జరిగేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. హైదరాబాద్‌లో ట్రాఫిక్ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారిందని విన్నానని.. ట్రాఫిక్ సమస్యను కూడా పరిష్కరిస్తామన్నారు. హత్యలు, అత్యాచారాలు, లా అండ్ ఆర్డర్‌పై కఠినంగా వ్యవహరిస్తామని చెప్పారు.
ఏడాదిలో నాలుగో కొత్వాల్..
కాగా, సీపీగా సీవీ ఆనంద్ నియామకంతో ఏడాది కాలంలోనే నాలుగో కొత్వాల్‌గా రికార్డులకు ఎక్కారు. మొదటి, నాలుగు స్థానాలు ఆనంద్‌వే కావడం గమనార్హం. మధ్యలో మాత్రం శాండిల్య, శ్రీనివాసరెడ్డి పని చేశారు. ఆయన తొలిసారిగా 2021లో హైదరాబాద్ సీపీగా నియమితులయ్యారు. ఆ ఏడాది డిసెంబర్ 25నుంచి గతేడాది అక్టోబర్ 12 వరకు విధులు నిర్వర్తించారు. అయితే.. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఆ మరుసటి రోజు బదిలీ అయ్యారు. అప్పటి నుంచి గత ఏడాది డిసెంబర్ 13 వరకు సందీప్ శాండిల్య పోలీసు కమిషనర్‌గా వ్యవహరించారు. ఆ మరుసటి రోజు బాధ్యతలు స్వీకరించిన కొత్తకోట శ్రీనివాస రెడ్డిని ఈ నెల 7న బదిలీ చేసిన ప్రభుత్వం.. మళ్లీ సీవీ ఆనంద్‌నే సీపీగా నియమించింది. దీంతో 21 ఏండ్ల తర్వాత హైదరాబాద్‌కు డీజీపీ స్థాయి అధికారిని కొత్వాల్‌గా నియమించడం ఇదే మొదటిసారి.
సిటీ కమిషనర్లుగా 60 మంది అధికారులు..
హైదరాబాద్ పోలీసు కమిషనరేట్ తొలి కొత్వాల్ హసన్ అలీ ఖాన్ నుంచి గత ఏడాది పోలీసు కమిషనర్‌గా వచ్చిన కొత్తకోట శ్రీనివాసరెడ్డి వరకు మొత్తం 60 మంది అధికారులు ఈ పోస్టులో పని చేశారు. సీవీ ఆనంద్ సంఖ్య 61 కాగా.. ఇప్పటి వరకు ఏడుగురికి మాత్రమే రెండోసారి నగర పోలీసు చీఫ్‌గా పని చేసే అవకాశం దక్కింది. గతంలో సి.రంగస్వామి అయ్యంగర్, బీఎన్ కాలియా రావు, ఎస్‌పీ సత్తారు, కె.విజయరామారావు, ఆర్.ప్రభాకర్‌రావు, వి.అప్పారావు, ఆర్పీ సింగ్‌లకు మాత్రమే ఇలా పని చేయగలిగారు. 2003లో ఆర్పీ సింగ్ తర్వాత 21 ఏళ్లకు సీవీ ఆనంద్‌కు ఈ అరుదైన రికార్డు సాధించారు.
ముఖ్యమంత్రితో బేటి
సిపిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం సివి ఆనంద్ మర్యాపూర్వకంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు. ఈ సందర్భంగా రేవంత్ ఆయనకు ఆల్ ది బెస్ట్ చెప్పారు..