Monday, November 18, 2024

TG: తెలంగాణ‌లో కొత్త విమానాశ్ర‌యాలు… ప‌రిశీలిస్తాన‌న్న కేంద్ర మంత్రి

ఆంధ్ర‌ప్ర‌భ స్మార్ట్ – శంషాబాద్ : తెలంగాణలో కొత్త విమానాశ్రయాల ఏర్పాటును పరిశీలిస్తామన్నారు కేంద్ర పౌర విమానయాన శాఖ కేంద్ర మంత్రి రామ్మోహన్‌ నాయుడు. విమానాశ్రయాల భద్రతలో అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు చెప్పారు. శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇవాళ‌ ఏవియేషన్‌ సెక్యూరిటీ కల్చర్‌ వీక్ కార్య‌క్ర‌మంలో ఆయ‌న పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా ఎయిర్ పోర్టు ఆవ‌ర‌ణ‌లో ఆయ‌న మొక్కలు నాటారు. అనంతరం మాట్లాడుతూ… ప్రతి ఒక్కరూ ఒక మొక్క నాటాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారని చెప్పారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్రతిఒక్కరూ మొక్కలు నాటాలని కేంద్రమంత్రి సూచించారు.

కాగా, చంద్రబాబు హయాంలోనే శంషాబాద్‌ ఎయిర్‌పోర్టుకు బీజం పడిందని తెలిపారు. అప్పుడు ఇంత భూమి ఎందుకు కేటాయించారని పలువురు విమర్శలు చేశారన్నారు.. ఆయ‌న దూరదృష్టితోనే శంషాబాద్‌ విమానాశ్రయానికి అంతర్జాతీయ స్థాయిలో పేరు వచ్చిందని చెప్పారు. అలాగే తెలంగాణ‌లో టు టైర్ ప‌ట్ట‌ణాల్లో కూడా విమానాశ్ర‌యాలు ఏర్పాటు చేయాల‌నే ఆలోచ‌న ఉంద‌ని అంటూ వాటిపై ఇక్క‌డి ప్ర‌భుత్వంతో సంప్ర‌దింపులు జ‌రుపుతామ‌ని చెప్పారు.. ఇక ప్రయాణికులు సైతం విమానాశ్రయాల్లో తనిఖీలు, భద్రత పట్ల అవగాహన కలిగి ఉండి.. భద్రతా సిబ్బందికి సహకరించాలని కోరారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement