Tuesday, November 19, 2024

Adilabad | నిర్లక్ష్య వైఖరి.. ఇన్‌చార్జి ప్రిన్సిపాల్‌పై సస్పెన్షన్‌ వేటు

మామడ( ప్రభ న్యూస్) : మామడ మండలంలోని కోరటికల్ ప్రాథమిక పాఠశాలలో రాగి జవాలో పడి మృతి చెందిన ఘటనకు ఉపాధ్యాయుల నిర్లక్ష్యం కారణమని జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఇంచార్జ్ ప్రధానోపాధ్యాయురాలి సస్పెన్షన్ చేశారు. అలాగే మిగతా ఉపాధ్యాయులకు షోకాజ్ నోటీసులను ఇవ్వడం జరిగిందని జిల్లా విద్యాశాఖ అధికారి డా. ఏ. రవీందర్ రెడ్డి తెలిపారు.

కోరటికల్ ప్రాథమిక పాఠశాలలో నిన్న (శనివారం) రాగి జావాను విద్యార్ధులకు అందించడంలో ఉపాధ్యాయుల నిర్లక్ష్య వైఖరి కారణంగా ప్రజ్ఞ అనే 1వ తరగతి విద్యార్థిని, అకస్మాత్తుగా రాగిజావ ఉన్న గంజులో పడింది. పాపకు తీవ్ర గాయాలు కాగా ఉపాధ్యాయులు వెంటనే ఆసుపత్రిలో చేర్పించడం జరిగింది.

జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు, పాఠశాల ఉపాధ్యాయుల నిర్లక్ష్య వైఖరికి, ఆరోజు ఇన్చార్జి గా ఉన్న ప్రధానోపాధ్యాయురాలిని సస్పెండ్ చేస్తూ, మిగతా ముగ్గురు ఉపాధ్యాయులకు షోకాజ్ నోటీసులను జారీ చేసి, వారిని జారీ చేసిన ఒకరోజులో తమ వివరణను సమర్పించాల్సిందిగా జిల్లా విద్యా శాఖాధీకారి ఆదేశించారు.

- Advertisement -

తీవ్ర గాయాలతో నిజామాబాదు లోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ , పాప ఈ రోజు 17.12.2023 న ఉదయం మరణించడం జరిగింది. ఈ సంఘటనలో గౌరవ జిల్లా కలెక్టర్ మరియు జిల్లా విద్యాశాఖ అధికారి, పాప తల్లిదండ్రులకు తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేయడం జరిగింది

Advertisement

తాజా వార్తలు

Advertisement