Friday, November 22, 2024

Negligence Deaths – చిన్న‌పాటి నిర్ల‌క్ష్యానికి నిండు జీవితాలు బ‌లి – మంత్రి వేముల

ఏర్గట్ల ప్రభ న్యూస్… – రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సహకారంతో ఇటీవల లెర్నింగ్ డ్రైవింగ్ లైన్సెన్స్ పొందిన ఏర్గట్ల మండలం కు సంబంధించిన యువతి, యువకులకు(సుమారు 750) గురువారం మండల కేంద్రంలోని నెరేళ్ల ఫంక్షన్ హాల్ లో లెర్నింగ్ డ్రైవింగ్ లైసెన్స్ పత్రాలను మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అందజేశారు. లెర్నింగ్ లైసెన్స్ పొందిన వారికి మంత్రి శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ…బాల్కొండ నియోజకవర్గ యువతీ,యువకుల కోసం సదుద్దేశంతో ఉచిత డ్రైవింగ్ లైసెన్స్ అందజేస్తున్నామని అన్నారు. లైసెన్సులు లేకుండా యువత చాలా చోట్ల పోలీసు చెకింగ్ లో దొరుకుతున్నరని,పోలీసు వారిని తప్పించుకునే క్రమంలో ప్రమాదాలకు గురై ప్రాణాలు కోల్పోయే పరిస్థితులు ఉన్నాయని స్థానిక ప్రజాప్రతినిధులు,పార్టీ నేతలు తన దృష్టికి తీసుకు వచ్చారని ఈ సందర్బంగా గుర్తు చేశారు. ఎంతో ఆలోచించే ఈ ఉచిత డ్రైవింగ్ లైసెన్స్ లు అందజేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని అన్నారు. దీంతో 12వేల దరఖాస్తులు వచ్చాయని,వాటిని త్వరిత గతిన పూర్తి చేసి లైసెన్స్ లు అందించే టెక్నికల్ సదుపాయం లేదని మన దగ్గర లేదని అధికారులు తర్వాత తన దృష్టికి తీసుకు వచ్చినట్లు తెలిపారు. దాని పర్యవసానంగా వేల్పూర్ లో ఎక్స్ టెన్షన్ సెంటర్ ఏర్పాటు చేయించి,రాష్ట్ర వ్యాప్తంగా రెండు చోట్ల మాత్రమే ఉన్న రూటర్ టెక్నాలజీ తెచ్చి బాల్కొండ నియోజకవర్గ యువతకు వెను వెంటనే లెర్నింగ్ లైసెన్స్ లు అందజేస్తున్నామని అన్నారు.

గతంలో నెలలు,ఏండ్లు తరబడి లైసెన్స్ ల కోసం తిరిగేదని, కానీ మీకు అప్లై చేసుకున్న మూడో రోజు లెర్నింగ్ లైసెన్స్ అందుతుందని అన్నారు. దీని వెనుక ఎంతో కష్టం, శ్రమ దాగి ఉందని వివరించారు. డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా.. ప్రమాదకరంగా వాహనాలు నడుపొద్దని మంత్రి యువతను కోరారు. జీవితం చాలా విలువైనది… ఏమరు పాటుతో యువత దాన్ని పాడు చేసుకోవద్దని హితవు పలికారు. ప్రాణాల పట్ల నిర్లక్ష్యం వద్దని,పోతే ప్రాణం తిరిగిరాదని హితబోధ చేశారు.

రోడ్డు ప్రమాదాలలో తలకు గాయాలు వల్లే ఎక్కువ మరణాలు సంభవిస్తున్నాయని, ఉచిత డ్రైవింగ్ లైసెన్స్ ఇచ్చినట్టే బాల్కొండ నియోజకవర్గ యువత శ్రేయస్సు దృష్ట్యా ఉచితంగా హెల్మెట్లు కూడా ఇస్తానని మంత్రి ఈ సంధర్బంగా తెలిపారు.ప్రతి ఒక్కరు ఖచ్చితంగా రోడ్డు భద్రత నియమాలు పాటించాలని మంత్రి కోరారు.

- Advertisement -

ఈ కార్యక్రమంలో ఎంపీపీ కొలిప్యాక ఉపేందర్ రెడ్డి, జడ్పీటీసీ గుల్లే రాజేశ్వర్ ,మండల అధ్యక్షుడు ఏనుగందుల రాజపూర్ణ నందం,మండల ప్రధాన కార్యదర్శి బద్దం శ్రీనివాస్ రెడ్డి, ఎంపీటీసీ మధుసూదన్, సొసైటీ అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి, బర్మ నర్సయ్య ,తడపాకల్ సర్పంచ్ పత్తిరెడ్డి ప్రకాష్ రెడ్డి,సొసైటీ ఉపాధ్యక్షుడు సింగసారం గంగారాం ,దోంచందా ఉపసర్పంచ్ సోమిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, ఆర్టియే అధికారులు,స్థానిక ప్రజాప్రతినిధులు,బిఆర్ఎస్ శ్రేణులు, పెద్ద ఎత్తున తరలివచ్చిన యువత పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement