Thursday, November 21, 2024

WGL: విధుల్లో నిర్లక్ష్యం… ఉమెన్ పీఎస్ సీఐపై వేటు

వరంగల్ క్రైమ్, ఆగస్టు 29 (ప్రభ న్యూస్) : విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహారించినందుకు గాను వరంగల్ అర్బన్ మహిళా పోలీస్ స్టేషన్ ఇన్స్ స్పెక్టర్ ఉస్మాన్ షరీప్ ను వీఆర్ కు అటాచ్ చేస్తూ వరంగల్ పోలీస్ కమిషనర్ ఏ. వీ రంగనాథ్ ఉత్తర్వులు జారీ చేశారు. ఫిర్యాదులపై పోలీస్ అధికారిగా బాధ్యతాయుతంగా స్పందించలేదన్న కారణంగా బదిలీ వేటు పడినట్లు తెలుస్తోంది.

ఎన్నికల కమిషన్ మార్గదర్శకాల సమయంలోనే సదరు ఇన్స్ పెక్టర్ కు స్థానచలనం పడుతుందని భావించారు. లూప్ లైన్ పోస్టు కావడం, పైగా మహిళ పోలీస్ స్టేషన్ ఇన్స్ పెక్టర్ గా ఎవ్వరు పనిచేయడానికి ఆసక్తి చూపకపోవడంతో బదిలీ జరగలేదు. సున్నితమైన కేసుల విషయంలో ఆచి తూచి స్పందించాల్సి ఉండటం వల్ల తక్షణ చర్యలు తీసుకోకపోవడంతో ఇన్స్ పెక్టర్ ఉస్మాన్ షరీఫ్ ను క్రమశిక్షణ చర్యల్లో భాగంగానే వేకన్సీ రిజర్వుకు పంపించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement