ఆంధ్రప్రభ బ్యూరో, ఉమ్మడి ఆదిలాబాద్: మే 29న ఆదిలాబాద్ లోని నిఖిల్ ఫర్టిలైజర్ షాప్ నుండి రైతులకు అందాల్సిన రాసి పత్తి విత్తనాలు పక్కదారి పట్టిన కేసులో అదిలాబాద్ వ్యవసాయ విస్తరణ అధికారిపై సస్పెన్షన్ వేటు పడింది. విత్తనాల పంపిణీలో నిర్లక్ష్యం వహించినందుకు ఏఈఓ శివచరన్ ను సస్పెండ్ చేస్తూ కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు.
డిమాండ్ ఉన్న విత్తనాలపై రైతుల సమస్యను పట్టించుకోకుండా పర్యవేక్షణ బాధ్యతల లోపం కారణంగా ఏఓలు భగత్, రమేష్ లను బదిలీ చేశారు. ఆదిలాబాద్ వ్యవసాయ అధికారి రమేష్ ను బూత్ అగ్రికల్చర్ అధికారిగా బదిలీ చేశారు. బోత్ వ్యవసాయ అధికారి ఆదిలాబాద్ కు బదిలీ పై రానున్నారు.