Saturday, December 28, 2024

NEET PG మెరిట్‌ జాబితా విడుదల..!

  • అర్హత సాధించిన 3314 మంది వైద్య విద్యార్థులు

పీజీ మెడికల్‌ వైద్య విద్యలో ప్రవేశాల కోసం మెరిట్‌ విద్యార్థుల జాబితాను కాళోజీ హెల్త్‌ యూనివర్సిటీ విడుదల చేసింది. మొత్తం 3314 మంది విద్యార్థులు పీజీ వైద్య సీట్ల కోసం అర్హత సాధించారు. మెరిట్‌ జాబితాలో 1,29,736 ర్యాంకు వరకు విద్యార్థులకు చోటు దక్కింది.

మెరిట్‌ జాబితా విడుదల చేయడంపై తెలంగాణ జూనియర్‌ డాక్టర్స్‌ అసోసియేషన్‌ హర్షం వ్యక్తం చేసింది. త్వరలోనే కోర్టు కేసును పరిష్కరించి నీట్‌ పీజీ రాష్ట్ర కోటా కౌన్సిలింగ్‌ ను నిర్వహించాలని కాళోజీ హెల్త్‌ యూనివర్సిటీని కోరింది. ఈ ఏడాది సెప్టెంబరు, అక్టోబరులోనే రాష్ట్ర కోటా నీట్‌ పీజీ కౌన్సిలింగ్‌ ప్రారంభమవాల్సి ఉండగా జాప్యం నెలకొనడంపై ఆందోళన వ్యక్తం చేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement