ఉమ్మడి మెదక్ బ్యూరో : తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ కు మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత నీలం మధు ముదిరాజ్ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. గురువారం మంత్రి జన్మదినాన్ని పురస్కరించుకొని సంగారెడ్డిలోని ఆయన స్వగృహంలో మంత్రి దామోదరని కలిసి పుష్పగుచ్చమిచ్చి పుట్టినరోజు విషెస్ తెలిపారు.
ఈ సందర్భంగా నీలం మధు మాట్లాడుతూ… ఉమ్మడి మెదక్ జిల్లా నుంచి మంత్రిగా ప్రాతినిధ్యం వహిస్తున్న దామోదర్ రాజనర్సింహ తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రిగా వైద్యశాఖలో తనదైన ముద్రను వేస్తున్నారని కొనియాడారు.
- Advertisement -