- మత్స్యకారుల సంక్షేమానికి పెద్దపీట వేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం..
- నీలం మధు ను కలిసిన పలు జిల్లాల మత్స్యకార సంఘం చైర్మన్ లు..
- కొల్లాపూర్ లో పండగ సాయన్న విగ్రహావిష్కరణకు ఆహ్వానం..
మెదక్ : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని తెలంగాణ ప్రభుత్వం మత్స్యకారుల సంక్షేమానికి పెద్దపీట వేస్తుందని మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ కంటెస్టెడ్ క్యాండిడేట్ నీలం మధు ముదిరాజ్ అన్నారు. శుక్రవారం పలు జిల్లాలకు చెందిన మత్స్యకార సహకార సంఘం చైర్మన్లు, సభ్యులు, నాయకులు నీలం మధును చిట్కుల్ లోని ఆయన క్యాంప్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా మత్స్యకారులు ఎదుర్కొంటున్న పలు సమస్యలను ఆయన దృష్టికి తీసుకునివచ్చారు. ఈ సమస్యలకు సానుకూలంగా స్పందించిన నీలం మధు త్వరలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకుని వెళ్లి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
అనంతరం నీలం మధు మాట్లాడుతూ… ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని తెలంగాణ ప్రజా ప్రభుత్వం అన్నివర్గాల అభివృద్ధి సంక్షేమం కోసం కృషి చేస్తుందని తెలిపారు. మత్స్యకారుల అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సానుకూలంగా ఉన్నారని, త్వరలో సమస్యల పరిష్కారానికి తగు నిర్ణయం తీసుకుంటారని ఆశాభవం వ్యక్తం చేశారు. అలాగే ఈనెల 10న వనపర్తి జిల్లా కొల్లాపూర్ నియోజక వర్గం పానగల్ మండలం రాయిని పల్లి గ్రామంలో పండగ సాయన్న విగ్రహావిష్కరణకు ముఖ్యఅతిథిగా హాజరుకావాలని వాకిటి ఆంజనేయులు ఆధ్వర్యంలోని పండుగ సాయన్న విగ్రహ కమిటీ సభ్యులు నీలం మధును ఆహ్వానించారు.
ఈ కార్యక్రమంలో భువనగిరి జిల్లా మత్స్య సహకార సంఘం జిల్లా చైర్మన్లు నీలరాజు, పెద్దపల్లి జిల్లా చైర్మన్ కోలిపాక నరసయ్య, ములుగు జిల్లా చైర్మన్ సాధు రఘు, భువనగిరి జిల్లా చైర్మన్ పాశం సంజయ్ బాబు, కరీంనగర్ జిల్లా చైర్మన్ బుస్స మల్లేశం, జోగులాంబ జిల్లా చైర్మన్ టి గోపాల్, జోగులాంబ జిల్లా వైస్ చైర్మన్ మద్దిలేటి పాల్గొన్నారు.