ప్రభన్యూస్ : ఈ ఆర్థిక సంవత్సరం నిర్దేశించుకున్న బొగ్గు ఉత్పత్తి లక్ష్యానికి చేరుకోవాలంటే సింగరేణిలో యంత్రాల వినియోగం రోజుకు 14 గంటల నుంచి 18 గంటల వరకు పెంచాలని సంగరేణి డైరెక్టర్లు చంద్రశేఖర్, బలరామ్, సత్యనారాయణలు సూచించారు. బొగ్గు రవాణాకు కూడా లారీల కొరత లేకుండా యాజమన్యాలు సహకరించాలని, కంపెనీ షావెల్సత్ రోజుకు 2 లక్షల క్యూబిక్ మీటర్ల ఓవర్ బర్డెన్ (ఓబీ) ను వెలికి తీయాలని ఆదేశించారు. సింగరేణి భవన్‌లో కంపెనీ యంత్రాల పనితీరు, సీహెచ్‌పీలపై ఏరియాల జీఎలతో సమీక్ష నిర్వహించారు. కంపెనీ షావెల్స్ పని చేస్తున్న ఆర్జీ ఓసీ-1, ఆర్జీ ఓసీ-2, ఆర్జీ ఓసీ-3, జీకే ఓసీ-, పీకే ఓసీలో కంపెనీ షావెల్స్‌తో పాటు ఇతర యంత్రాలును రోజుకు 14 గంటలకు మించి వినియోగించడం లేదన్నారు.
యంత్ర వినియోగాన్ని 18 గంటలకు పెంచి రక్షణతో కూడిన ఉత్పత్తి సాధించాలన్నారు. కంపెనీ యంత్రాల ద్వారా రోజుకు 2 లక్షల ఓబీకి తగ్గకుండా చూడాలన్నారు. బొగ్గు రవాణాలో 60 శాతం వృద్ధి సాధించామని తీసుకోవాలన్నారు. గనుల వద్ద నుంచి బొగ్గు రవాణకు చర్యలు తీసుకోవాలని, లారీలు అందు బాటులో ఉండేలా చూడాలన్నారు. డీజెల్ ధరల హెచ్చు తగ్గులకు అనుగుణంగా ధరలను చెల్లించే ఫార్మూలను మార్చినట్లు, లారీ ట్రాన్స్‌పోర్టు యాజమాన్య సమస్యలు పరిష్కరించినట్లు డైరెక్టర్లు తెలిపారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital