సిద్దిపేట : హుస్నాబాద్ గెలుపు.. బీఆర్ఎస్ పార్టీ 95 నుంచి 100 సీట్లు గెలిచేందుకు నాంది కావాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆకాంక్షించారు. ఎన్నికల తొలి బహిరంగ సభలో మీ ఆశీర్వాదం కోరడానికి హుస్నాబాద్ వచ్చానని కేసీఆర్ తెలిపారు. హుస్నాబాద్ నియోజకవర్గం వేదికగా సీఎం కేసీఆర్ అసెంబ్లీ ఎన్నికల శంఖారావాన్నిపూరించారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ…. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలవాలి. ఎమ్మెల్యే సతీశ్ బాబు ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటారన్నారు. బ్రహ్మాండంగా మీ సేవ కోసం పని చేస్తున్నారన్నారు. 60 వేల భారీ మెజార్టీతో గెలుస్తారని విశ్వాసం ఉందన్నారు. హుస్నాబాద్ గెలుపు.. 95 నుంచి 100 సీట్లు గెలిచచేందుకు నాంది కావాలన్నారు. ఈ తొలి బహిరంగ సభలో మీ ఆశీర్వాదం కోరడానికి వచ్చానని, బ్రహ్మాండమైన మేనిఫెస్టోను ప్రకటించామన్నారు. బీఆర్ఎస్ మేనిఫెస్టోను ఉధృతంగా ప్రచారం చేయాలన్నారు. అద్భుతమైన విజయం సాధించాలని కేసీఆర్ ఆకాంక్షించారు. ఇప్పుడు మోటార్లు కాలడం లేదు. ఉత్తమమైన నాణ్యమైన విద్యుత్ అందిస్తున్నాం అని కేసీఆర్ తెలిపారు. ఒకప్పుడు హుస్నాబాద్ కరువు ప్రాంతమని కేసీఆర్ గుర్తు చేశారు. కానీ ఇవాళ హెలికాప్టర్ నుంచి చూస్తుంటే చాలా ఆనందం కలిగిందన్నారు. కనుచూపు మేర పంట పొలాలు కనబడుతున్నాయన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో నిర్లక్ష్యానికి గురైన మహాసముద్రం గండి పూర్తి చేయడంతో 10, 12 గ్రామాల్లో ఊటలు పెరిగాయని కేసీఆర్ గుర్తు చేశారు. మిషన్ భగీరథ ద్వారా నేరుగా గ్రామం ట్యాంకులో నీళ్లు పడుతున్నాయని సీఎం పేర్కొన్నారు. ఇలాంటి స్కీం ప్రపంచంలో ఎక్కడా లేదన్నారు. ఐదు సంవత్సరాల నుంచి నీళ్ల సరఫరా బ్రహ్మాండంగా కొనసాగుతోందన్నారు. గౌరవెల్లి, శనిగరం ప్రాజెక్టులు పూర్తి చేస్తామన్నారు. హుస్నాబాద్‌కు కావాల్సిన పనులు రెండు మూడు ఉన్నాయి.. గౌరవెల్లి ప్రాజెక్టు పూర్తి చేయాలని కోరారు. ఎన్నికల తర్వాత ఐదారు నెలల్లో యుద్ధప్రతిపాదన పూర్తి చేసి ఇదే హాదాలో వచ్చి నీళ్లు వదులుతామన్నారు. శనిగరం ప్రాజెక్టు ప్రధాన కాల్వ పూర్తి కావాలని కోరుతున్నారు. ఆ ప్రాజెక్టు కట్ట లీకేజీలకు మరమ్మతులు చేస్తామన్నారు. ఈ ప్రాజెక్టును కాళేశ్వరంతో కలిపాం కాబట్టి గోదావరి నీటితో పంటలు పండుతాయని కేసీఆర్ తెలిపారు.
CM KCR : 95 నుంచి 100 సీట్లు గెలిచేందుకు నాంది కావాలి.. కేసీఆర్
Advertisement
తాజా వార్తలు
Advertisement