తెలంగాణలో కరోనా విలయతాండం చేస్తోంది. కరోనా మృతుల సంఖ్య రోజురోజుకి పెరుగుతోంది. మంచిర్యాల జిల్లాలోని బెల్లంపల్లి ఐసోలేషన్ కేంద్రంలో వరుస కరోనా మరణాలు చోటు చేసుకుంటున్నాయి. 42 గంటల వ్యవధిలో 16 మంది కరోనా రోగులు మృతి చెందారు. బుధవారం సాయంత్రం 7 గంటల నుంచి నిన్న సాయంత్రం 7 గంటల వరకు 12 మంది మృతి చెందారు. శుక్రవారం ఉదయం నుంచి ఇప్పటివరకు నలుగురు మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొంది ఐసోలేషన్‌కు వచ్చినట్లు వైద్యులు వెల్లడించారు. పరిస్థితి విషమించిన తర్వాత ఐసోలేషన్‌కు రావడం వల్లనే మృతుల సంఖ్య పెరుగుతోందని చెప్పారు. కాగా, మృతు సంఖ్య పెరుగుతండడంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కరోనా బాధితుల్లో భయాందోళనలు నెలకొన్నాయి.
ఇదీ చదవండి: దేశంలో మరోసారి రికార్డ్ స్థాయిలో కరోనా కేసులు….24 గంటల్లో 4 లక్షల కేసులు