Tuesday, November 26, 2024

నిజాంసాగర్ ప్రాజెక్టు కు జలకళ – వ‌రద గేట్లు ఎత్తే అవకాశం

నిజాంబాద్ జిల్లాకు వరప్రదాయని అయినటువంటి నిజాంసాగర్ ప్రాజెక్టుకు సరిపడా నీరు వచ్చి చేరుతుందంటే దేశంలో వరదలు వచ్చి తీరాల్సిందే అనే నానుడు నిజాంబాద్ ప్రజల్లో ఉన్నది. గత వారం రోజులుగా తెలంగాణ రాష్ట్రంలో భారీ అతి భారీ వర్షాలు కురవడం ఎన్నోచోట్ల రోడ్లు వంతెనలు కుప్పకూలడం కొన్నిచోట్ల పల్లపు ప్రాంతాల్లో పంట నష్టం వాటిల్లింది. గతంలో నిజాంసాగర్ ఎప్పుడు నీటితో కలకల్లాడుతూ ఉండేది. గత 15 ఏళ్ల నుండి నిజాంసాగర్ ప్రాజెక్టు వేలవేల పోతుంది. నిజాంసాగర్ పై భాగంలో కర్ణాటక ప్రభుత్వం ఎన్నో ప్రాజెక్టులు నిర్మించడం మన ప్రభుత్వం నిజాంసాగర్ పైభాగాన సింగూర్ ప్రాజెక్టును నిర్మించినాటి నుండి నిజాంసాగర్ ఆయకట్టు రైతులు పంటల సాగులో ఎన్నో ఇబ్బందులు పడుతూనే ఉన్నారు.

ప్రతి ఏడాది దేశంలో వరదలు చోటుచేసుకున్న సందర్భంగా మాత్రమే నిజాంసాగర్ లో వరద నీరు వచ్చి చేరుతుంది. గత వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు నిజాంసాగర్కు సైతం కొద్దికొద్ది నీరు వచ్చి చేరడంతో నేడు నిండేదశకు చేరుకుంది. 22 టీఎంసీల సామర్థ్యం గల నిజాంసాగర్ ప్రాజెక్టులో పూడిక చేరుకోవడంతో నేడు 18 టీఎంసీల సామర్థ్యానికి చేరుకుంది. ప్రస్తుతం 15 టిఎంసిల నీరు ప్రాజెక్టులో నిల్వ ఉంది మరో రెండు టీఎంసీలు నీరు వచ్చి చేరే అవకాశం బలంగా కనబడుతుంది. ప్రస్తుతం నిజాంసాగర్లోకి 13 వేల క్యూసెక్కుల నీరు ప్రాజెక్టులకు చేరుతుంది. నిజాంసాగర్ నిండితే గేట్ల ద్వారా రాత్రి కోరేపో మంజీరా నదికి భారీగా నీరు వచ్చి చేరే అవకాశం ఉంది. అధికారుల సైతం ముందస్తుగానే అప్రమత్తమై ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. వర్షాకాలానికి ముందు నిజాంసాగర్ ప్రాజెక్టులో ఐదు టీఎంసీల నీరు మాత్రమే నిల్వ ఉన్నది. వరదలు రాకపోతాయా నిజాంసాగర్ లోకి వరద నీరు రాకుండా ఉంటుందా అనే నమ్మకంతో ఆయకట్టు రైతులకు 15 రోజులపాటు సాగునీరును అందించారు. నిజాంసాగర్ ఆయకట్టు ప్రాంతంలో ఎక్కువగా బోరు బావుల మీద ఆధారపడి వ్యవసాయం కొనసాగిస్తున్నారు.

వర్షాకాలం ఆరంభంలో నెల రోజులు వర్షాలు పడకపోవడంతో నారు మళ్లను సిద్ధం చేసుకున్న రైతాంగం కొంతవరకు ఆందోళన చెందింది. బాన్సువాడ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న పోచారం శ్రీనివాస్ రెడ్డి ప్రతినిత్యం రైతు సమస్యలపై ప్రత్యేక శ్రద్ధ చూపుతూ తాను రైతుబిడ్డగా తనకున్న అపార అనుభవాన్ని దృష్టిలో ఉంచుకొని ముందస్తుగా సాగు చేయాలని ప్రభుత్వమే ఆదేశించడంతో నిజాంసాగర్ రైతులు ముందస్తుగా నారుమళ్లను సిద్ధం చేసిన రైతులు ఇబ్బందులు పడకూడదన్న ఆలోచనతో నిజాంసాగర్ లో కొద్దిపాటి నిల్వ ఉన్న సాగర్ నీటిని సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి జుక్కల్ ఎమ్మెల్యే గా అప్పట్లో కాలువలకు నీటిని విడుదల చేశారు. నేడు బాన్సువాడ బోధన్ నియోజకవర్గాల్లో రైతులు సాగుచేసిన వరి పంట ఎంతో ఏపుగా పెరిగి కళకళలాడుతుంది. నిజాంసాగర్లోకి వరద నీరు రావడంతో నిజాంసాగర్ పూర్తి సామర్థ్యంలో నీరు వచ్చే చేరే అవకాశాలు కనబడడంతో ఆయకట్టు రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement